దిల్ రాజు పై ఒత్తిడి తెస్తున్న జూ.ఎన్టీఆర్ !?
బృందావనం చిత్రం రిలీజ్ డేట్ ఛేంజ్ చేయటానికి వీల్లేదని, అనుకున్న డేట్ అక్టోబర్ 8నే చిత్రం రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ పట్టుబట్టి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే దిల్ రాజు..ఈ చిత్రాన్ని ఓ వారం వాయిదా వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తన ఫ్యాన్స్ ఒప్పుకోరని, ఆ డేట్ నే ఫిక్స్ చేయమని ఎన్టీఆర్ చెప్తున్నారని వినిపిస్తోంది. ఇక మహేష్ ఖలేజా డేట్ అక్టోబర్ 7నే అని అఫీషియల్ గా పేపర్లో ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వటంతో ఇక దాన్ని మార్చే అవకాశం లేదు కాబట్టి తామన్నా కాస్త వెనక్కి తగ్గితే బిజెనెస్ బాగుంటుందని అనుభవం కలిగిన పంపిణీదారుడుగా దిల్ రాజు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 న రిలీజ్ చేద్దామని ప్రపోజ్ చేసారని, ఎన్టీఆర్ శ్రేయాభిలాషులు చేత కూడా చెప్పిస్తున్నారు కాబట్టి వాయిదా పడినా ఆశ్చర్యపడక్కర్లేదని ఫిల్మ్ నగర్ రిపోర్టు.


Click it and Unblock the Notifications











