For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్, పూరి కోల్డ్ వార్... ఫైనల్ గా

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సమయంలో హీరో,దర్శకుడు మధ్య ఇగో సమస్యలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. దాంతో సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కావాల్సింది మొదలు కాలేదు. అయితే తర్వాత సెప్టెంబర్ 15 నుంచీ షూటింగ్ మొదలు అవుతుందీ అన్నారు. అభిమానులను నిరాసపరుస్తూ అదీ కాలేదు.

    అయితే ఇదంతా గమనిస్తున్న నిర్మాత బండ్ల గణేష్ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్యా సయోధ్య కుదుర్చినట్లు సమాచారం. దాంతో సెప్టెంబర్ 22 నుంచీ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా హీరో,దర్శకుడు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కు ఫుల్ స్టాఫ్ పెట్టకపోతే తను నష్టపోతానని భావించిన బండ్ల గణేష్ వెంటనే కార్యాచరణంలోకి దిగి, సెట్ చేసుకున్నట్లు చెవ్తున్నారు.

    NTR-Puri cold War came to an End

    బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ప్రొడక్షన్స్ వారి 5 వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రం భారీగా నిర్మించనున్నానని బండ్లగణేష్ చెప్తున్నారు. ఆంధ్రావాలా చిత్రం తర్వాత ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్ లో చిత్రం రాలేదు. వీరి కాంబినేషన్ లో చిత్రం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు కానీ ఇన్నాళ్లకు కానీ వీలుపడలేదు.

    చిత్రానికి 'నేనో రకం' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ కి ఇదే ఉపశీర్షిక. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ...అవినీతితో నిండిపోయి ...ఎప్పుడూ లంచం...లంచం అంటూ తిరిగే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని చెప్తున్నారు. పూర్తి మాస్ మసాలాతో సాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రం నిర్మిస్తున్నారు.

    బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. అతి త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Bandla Ganesh stepped into action to sort out the issues between NTR and Puri Jagannath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X