ఎన్టీఆర్-పూరీ జగన్నాధ్ కాంబినేషన్ టైటిల్
జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో త్వరలో మరో చిత్రం తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరీ ఓ టైటిల్ జజెస్టు చేస్తే దాన్ని ఎన్టీఆర్ వెంటనే ఓకే చేసాడని చెప్తున్నారు. ఆ టైటిల్ మరేదో కాదు..రాము. గతంలో సీనియర్ ఎన్టీఆర్ రాము టైటిల్ తో ఓ చిత్రం చేసారు. ఆ తర్వాత బాలకృష్ణ అదే టైటిల్ తో మరో చిత్రం చేసారు. ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్. దాంతో అదే టైటిల్ తో మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యాలని ఎన్టీఆర్,పూరీ ఫిక్స్ అయ్యారని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రంకి చెందిన ముహూర్తం, విడుదల తేదీలను పూరీ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ఓపెన్ చేస్తారు. అలాగే రిలీజ్ ని సంక్రాంతి 2013 రోజున ఫిక్స్ చేసారు. ఈ విషయానికి ఎన్టీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంక్రాంతికి బిజినెస్ మ్యాన్ విడుదల చేసి ఘన విజయం సాధించిన పూరీ మళ్లీ సంక్రాంతికి ఎన్టీఆర్ తో హిట్ కొట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే మొదట మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 చిత్రం తీసి సంక్రాంతికి విడుదల చేస్తారని ఊహించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ పూరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక గతంలో పూరీ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా చిత్రం విడుదలై డిజాస్టర్ అయ్యింది. అ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తాను పవన్ తో చేయాల్సిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం స్క్రిప్టు పూర్తి చేసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ తన దమ్ము చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు.
పూరీ జగన్నాధ్. ఆ విషయాలను,షెడ్యూలను ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. ఆ ట్వీట్ లో...ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఆగస్టులో మొదలవుతుంది. గణేష్ బండ్ల ఈ చిత్రం నిర్మిస్తారు. సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ ఉంటుంది. ఇక రవితేజ సినిమా మార్చిలోనూ,పవన్ కళ్యాణ్ తో చేయబోయే చిత్రం మే నెలలోనూ, మహేష్ తో చేయబోయే చిత్రం ఆ తర్వాత ఉంటుంది అన్నారు. ఇక ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా చేసిన తర్వాత పూరీ చేస్తున్న చిత్రం ఇదే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దమ్ము హడావిడిలో ఉన్నారు. సింహా తర్వాత బోయపాటి డైరక్ట్ చేస్తున్న దమ్ము చిత్రం సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











