ఎన్టీఆర్ కు ఇలాంటి టైటిల్...సూటవద్దా?

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి రుబాబు అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అది కాకుండా మరో టైటిల్ ని నిర్మాత బండ్ల గణేషష్ రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. ఆ టైటిల్ ...నేనో రకం. పూరి జగన్నాథ్ ఈ టైటిల్ ని చెప్పారని వెంటనే బండ్ల గణేష్ ఈ టైటిల్ తో చిత్రం చేద్దామని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఇంకా ఈ టైటిల్ కి ఓకే చెప్పారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఓ భారీ చిత్రం నిర్మించనున్నారు. మంగళవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు.

NTR, puri Jagan new film Neno Rakam

పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. అతి త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X