»   » జూ ఎన్టీఆర్-పూరీ జగన్ న్యూ మూవీ టైటిల్ ఏంటో తెలుసా?

జూ ఎన్టీఆర్-పూరీ జగన్ న్యూ మూవీ టైటిల్ ఏంటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'కుమ్మేస్తా', 'కుమ్ముతా' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన సినిమా కావడంతో 'కుమ్మేస్తా' టైటిల్ ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. గతంలో జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టిన గణేష్ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌తో చేసే ఛాన్స్ రావడంపై ఆనందంగా ఉన్నాడు. వాస్తవానికి....మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు బండ్ల గణేష్. అయితే ఇతర ప్రాజెక్టుల ఇచ్చిన కమిట్మెంట్స్ వల్ల పూరి జగన్నాథ్‌తో చేయాల్సిన సినిమాను హోల్డ్‌లో పెట్టాడు మహేష్ బాబు. ఆయనతో సినిమా చేయడానికి చాలా సమయం ఉండటంతో ఈ లోగా జూ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేసాడు పూరి. ఈ సినిమాను నిర్మించే అవకాశం కూడా బండ్ల గణేష్‌కే ఇచ్చాడు.

NTR-Puri new movie titled 'Kummestha'

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ 'రభస' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. టోటల్ షూటింగ్ మే నెలలో పూర్తవుతుందని అంటున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్ తన సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

పక్కా ప్లానింగుతో సినిమా తీసే పూరి జగన్నాథ్ ఈ సంవత్సరాంతంలోగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పదేళ్ల క్రితం పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో 'ఆంధ్రావాలా'చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

English summary

 Young Tiger Jr NTR’s next film with Puri Jagannath has been titled as ‘Kummestha’. Puri is considering two titles Kummestha and Kummutha for the film, but his first preference is for the prior one.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu