జూ. ఎన్టీఆర్...ఫుల్లీ కరెప్టడ్
హైదరాబాద్ :'ఫుల్లీ కరెప్టడ్'...పూర్తి అవినీతి పరుడు...అదేంటి ఎన్టీఆర్ ని అవినీతిపరుడు అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా...నిజమే ఎన్టీఆర్ త్వరలో ఈ క్యారక్టర్ లో ఒదిగిపోనున్నారు. అందుకే ఈ క్యారెక్టర్ గురించి తెలిసేలా... ఇలాంటి ట్యాగ్ లైన్ ని పెడుతున్నారు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి 'నేనో రకం' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ కి ఇదే ఉపశీర్షిక.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ ...అవినీతితో నిండిపోయి ...ఎప్పుడూ లంచం...లంచం అంటూ తిరిగే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. పూర్తి మాస్ మసాలాతో సాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రం నిర్మించనున్నారు. ఆగస్టు 1 నుంచి షూటింగ్ మొదలుకానుంది.

బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. అతి త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











