కొత్త స్కీమ్ : ఎన్టీఆర్, పూరీ రెమ్యునేషన్స్
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా బండ్లగణేష్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెమ్యునేషన్స్ విషయమై ఓ ఆసక్తికరమైన సంగతి బయిటకు వచ్చింది. ఎన్టీఆర్ రెమ్యునేషన్ క్రింద నైజాం రైట్స్ ని, పూరీ జగన్నాథ్ సీడెడ్ రైట్స్ ని తీసుకున్నట్లు సమాచారం. దాంతో వీరిద్దరూ తమ ఏరియల్లో డిస్ట్రిబ్యూటర్స్ కు తమ రేటుకు తగినట్లు బిజినెస్ చేసుకోవచ్చు. మిగిలిన ఏరియాలను బండ్ల గణేష్ అమ్ముకుంటాడు. దాంతో ఈ రెండు ఏరియాల రిస్క్ కూడా వీరిద్దరకే ఉంటుంది.
వరసగా భారీ బడ్జెట్ చిత్రాలు ఫెయిల్యూర్స్ అవుతూండటంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాంతో నిర్మాత బండ్ల గణేష్ పై భారం పడకుండా ఆగినట్లైంది. ఇనీషియల్ గా కొంత మొత్తం అడ్వాన్స్ లు ఇచ్చినప్పటికీ ఇక వారికి డైరక్ట్ గా క్యాష్ గా పేమెంట్ ఉండదు. అయితే నైజాం, సీడెడ్ లు రెండూ పెద్ద ఏరియాలు.వాటిపైనే ఎక్కువ బిజినెస్ జరిగేదన్నది కూడా వాస్తవం. కానీ బండ్ల గణేష్ కు ఇప్పుడు వీరి రెమ్యునేషన్లు డైరక్ట్ గా లేకపోవటంతో పెట్టుబడి కూడా తగ్గినట్లైంది.

చిత్రం లేటెస్ట్ ఇన్ఫో...
పూరి జగన్నాథ్ అంటే స్పీడు కు మారు పేరు. ఆయన స్క్రిప్టుని స్పీడుగా రాయటమే కాదు..అంతకన్నా వేగంగా తెరకు ఎక్కించగలరని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు. అందుకే హీరోలంతా ఆయన డైరక్షన్ లో చేయటానికి ఉత్సాహం చూపిస్తారు. హిట్టో,ఫట్టో నాలుగైదు నెలల్లో తేల్చేయటం ఆయన స్పెషాలటి. అలాగని ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవటమనేది జరగదు. తెరపై ఏ ఫ్రేమ్ ఎలా వస్తుందో, ఏ షాటో అవసరమో పూర్తి క్లారిటీతో ఉండటమే ఆయన స్పీడు సీక్రెట్ అని చెప్తూంటారు. తాజాగా చేస్తున్న ఎన్టీఆర్ సినిమాతో అది మరోసారి పూరి ప్రూవ్ చేస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్టాఫ్ అప్పుడే పూర్తైందని సమాచారం. అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ కు కూడా పూర్తి ఏర్పాట్లు చేసాడని, పూరి స్పెషల్ గా ఎన్టీఆర్ ని స్టైలిష్ గా డిజైన్ చేసాడని అంటున్నారు. ఫస్ట్ లుక్ తోనే బిజినెస్ క్రేజ్ తెచ్చి పూర్తి చేద్దామనే ధీమాలో దర్శక,నిర్మాతలు ఉన్నారు. ఈ వారం చివరలో ఫస్ట్ లుక్ రిలీజ్ ఉండబోతోందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా భావించి ఈ చిత్రాన్ని పూరి తీర్చి దిద్దుతున్నారు.
షూటింగ్ ను అత్యంత వేగంగా పూర్తి చేయగల దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన సినిమా అంటే యూనిట్ మొత్తం చాలా స్పీడుగా ఉండాలి. ప్రస్తుతం ఎన్టీఆర్-పూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఓ చిత్రం మరింత వేగంగా చిత్రీకరణ జరుగుతోందని యూనిట్ అంటోంది. ప్రస్తుతం యూనిట్ అంతా గోవా షూటింగ్ లో తలమునకలై ఉంది. ఇందులో ఎన్టీఆర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో ఓ పాటతో సహా పోరట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇటీవల ఉత్తరాంధ్రాలో సంబవించిన తుఫాన్ కారణంగా వైజాగ్ షెడ్యూల్‌ను సైతం గోవాలోనే షూట్ చేయనున్నారని వినిపిస్తుంది. ఇప్పటికే పలుకారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఆన్ సెట్స్‌లోనే పూరీ ఎస్. ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఎడిటింగ్ పనులు కూడా చేయిస్తున్నారని యూనిట్ అంటోంది.
ఈ సినిమాకు టైటిల్స్‌గా 'రుబాబు' 'టెంపర్', 'నేనొరకం', అంటూ ప్రచారం సాగుతోంది. తాజగా 'షంషేర్' అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. అన్ని పనులు పూర్తిచేసి సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తుంది. పరమేశ్వర ఆర్స్ట్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











