రభస: అనూప్ రూబెన్స్‌ను రిజెక్ట్ చేసిన జూ ఎన్టీఆర్

ఇటీవల వచ్చిన ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందేతో పాటు పలు చిత్రాలకు అనూప్ అందించిన సంగీతం మంచి ఆదరణ పొందింది. జూ ఎన్టీఆర్ 'రభస' సినిమాకు చాన్స్ దక్కించుకోవడంతో అతడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరడం ఖాయమనుకున్నారంతా. కానీ అతని చేతి నుంచి ఆ అవకాశం చేజారి పోవడం చర్చనీయాంశం అయింది.
'రభస' చిత్రానికి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహింస్తుండగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మళయాలం హీరోయిన్ నజ్రియాను సెకండ్ హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.
ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.'


Click it and Unblock the Notifications











