సైలెంట్ అయిన రాజమౌళి.. మెగా, నందమూరి అభిమానుల నిరాశ

రాజమౌళి చేసిన పనికి మెగా, నందమూరి అభిమానులు నిరాశ చెందారని తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా RRR నుంచి కనీసం ఏదో ఒక చిన్న సర్‌ప్రైజ్ అయినా ఇస్తాడని భావించారట మెగా, నందమూరి అభిమానులు అభిమానులు. కానీ వారు అనుకున్న దానికి భిన్నంగా జరగటంతో తీవ్రంగా నిరాశకు లోనయ్యారని గుసగుసలు విపిస్తున్నాయి. ఆ వివరాలు చూస్తే..

స్వాతంత్ర్య దినోత్సవం.. ఉదయం నుంచే స్టార్ట్

స్వాతంత్ర్య దినోత్సవం.. ఉదయం నుంచే స్టార్ట్

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తమ తమ సినిమాల అప్‌డేట్స్ ఇవ్వడం ఉదయం నుంచే స్టార్ట్ చేశారు ఇతర దర్శకనిర్మాతలు. స్టార్ హీరోల అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ టైటిల్ ప్రకటన, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లాంటి వాటితో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఉదయం నుంచే ఇతర సినిమాల అప్‌డేట్స్ చూస్తూ ఇక తమ అభిమాన హీరో అప్‌డేట్ ఒక్కటైనా వస్తుందేమో అని ఆశగా చూశారు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు. కానీ అది జరగలేదు.

అల్లు అర్జున్, రవితేజ, వరుణ్ తేజ్

అల్లు అర్జున్, రవితేజ, వరుణ్ తేజ్

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు అల.. వైకుంఠపురములో అనే టైటిల్ ప్రకటించడంతో బన్నీ అభిమానులు ఖుషీ అయ్యారు. ఇక మాస్ మహారాజ్ రవితేజ కూడా తన కొత్తసినిమా డిస్కో రాజా నుంచి ఓ లుక్ విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. మరోవైపు వరుణ్ తేజ్ వాల్మీకి టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు ఇండిపెండెన్స్ డే కానుక ఇచ్చారు హరీష్ శంకర్.

మహేష్ సరిలేరు నీకెవ్వరు.. మరి ఎన్టీఆర్, రామ్ చరణ్

మహేష్ సరిలేరు నీకెవ్వరు.. మరి ఎన్టీఆర్, రామ్ చరణ్

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు నుంచి ఆర్మీ సాంగ్ రిలీజ్ చేస్తూ ఆయన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. కానీ రాజమౌళి నుంచి మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు నిరాశే ఎదురైంది. RRR సినిమాలో స్వాంత్ర్య సమరయోధులుగా ఎన్టీఆర్, చెర్రీ నటిస్తున్నారు కాబట్టి ఇండిపెండెన్స్ డే కానుక ఉటుందని ఉహించారట వారి వారి అభిమానులు.

రాజమౌళి మదిలో అదే ఉందా..?

రాజమౌళి మదిలో అదే ఉందా..?

నిజానికి రాజమౌళి సినిమా అంటేనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అందునా బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత చేస్తున్న సినిమా RRR కావడంతో ఈ సినిమా విశేషాల పట్ల కాస్త సీక్రెసీ మెయిన్‌టైన్ చేస్తున్నారు జక్కన్న. మరీ ఇంత ముందుగా అప్‌డేట్స్ ఇవ్వడం కన్నా, వచ్చే ఏడాది మొదటి నెల నుంచే సినిమాపై హైప్ తెచ్చేలా అప్‌డేట్స్ ఇవ్వాలని రాజమౌళి భావిస్తున్నట్లుగా సమాచారం.

 RRR మూవీ

RRR మూవీ

డీవీవీ దానయ్య సమర్పణలో RRR అనే వర్కింట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో మరో క్లారిటీ రాలేదు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X