జూ ఎన్టీఆర్ పై 'బిజినెస్ మ్యాన్' ఎఫెక్టు
జూ.ఎన్టీఆర్ పై బిజినెస్ మ్యాన్ ప్రెషర్ బాగా పెరిగనట్లు ఫిల్మ్ సర్కిల్సో వినపడుతోంది. బిజినెస్ మ్యాన్ చిత్రం రికార్డులు బ్రద్దలు కొట్టి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దాంతో స్టార్ రేస్ లో ఉన్న తాను సైతం ఆ రేంజి హిట్ ఇచ్చి తన స్టామినాని మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ఎన్టీఆర్ తలపోస్తున్నట్లు చెప్తున్నారు. తన పూర్తి దృష్టిని అంతటినీ దమ్ము చిత్రంపైనే పెట్టాడని అంటున్నారు. గత సంవత్సరం సింహా చిత్రంతో బాలకృష్ణకు సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను తనకూ అంతకన్నా పెద్ద హిట్ ఇస్తాడని నమ్ముతున్నాడు. ఊసరవెల్లి చిత్రం అనుకున్న విధంగా బాక్సాపీస్ వద్ద హిట్ ని నమేదు చెయ్యలేకపోవటంతో ఎన్టీఆర్ ఇప్పుడు ఎలాగైనా తన ప్రతిభతో ఘన విజయం సాధించాలని భావిస్తున్నారు. తన ప్లస్ పాయింట్స్ అయిన ఎమోషన్స్ పండించటం,డాన్స్ లుపై దమ్ములో ప్రత్యేక కాన్సర్టేషన్ పెట్టాడని వినికిడి.
దానికి తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఇమిడి ఉన్నాయని,అది ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు. ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తిక నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ క్రింద కనిపించనున్నారు. సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. దానికి తోడు బోయపాటి ఒకటికి రెండు సార్లు ప్రతీ డైలాగుని శ్రద్దగా చూసి ఓకే చేసి, రేపు మాస్ నుంచి టప్పుట్లు కొట్టించుకునే విధంగా రూపొందిస్తున్నాడని వినికిడి. అంటే ఎన్టీఆర్ విజృంభణ త్వరలో మనం చూడబోతున్నామన్నమాట.


Click it and Unblock the Notifications











