ఎన్టీఆర్ ని టెన్షన్ పెడుతున్న మహేష్ బాబు
మహేష్ దూకుడు చిత్రం ఇప్పటికే ఎక్కడ విన్నా చాలా పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ రిపోర్టు వినపరడుతోంది. ఈ నేపధ్యంలో త్వరలో ఎన్టీఆర్ చాలా కంగారుపడుతున్నాడంటూ వినపడుతున్నాయి. ఎన్టీఆర్ ఊసరవిల్లి చిత్రం కూడా కొద్ది రోజుల్లో విడుదల తేది ఉండటంతో ఈ ఎఫెక్టు తన చిత్రంపై ఉంటుందని భావిస్తున్నాడని చెప్తున్నారు.అయితే అవన్నీ కేవలం రూమర్స్ అని మరి కొందరు కొట్టి పారేస్తున్నారు.ఎన్టీఆర్, మహష్ మంచి స్నేహితులని దాంతో ఎన్టీఆర్ ఈ దూకుడు విజయం అవటం చాలా ఆనందపరిచే అంశంగా భావిస్తాడని చెప్తున్నారు.
ఇక ఊసరివిల్లి చిత్రం కూడ ఇప్పుడు క్లిక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శక్తి చిత్రం ఎన్టీఆర్ కి చాలా చేదు అనుభవాన్ని ఇచ్చింది. అలాగే ఊసరవిల్లి చిత్రానికి కూడా మంచి టాక్ ఉండటం కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఆ సినిమా ఎన్టీఆర్ గత చిత్రం రికార్డులను తిరగ రాస్తుందని చాలా మంది అంటున్నారు. ఎన్టీఆర్ ఓ ప్రేమికుడుగా కనిపించే ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్బుతంగా వచ్చాయని టాక్. ఇక ఈ దసరాకి ఈ రెండు సినిమాల మధ్యే పోటీ అనేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications











