బెల్లంకొండ మెగా ట్విస్ట్: రామ్ ని తప్పించి ఎన్టీఆర్ ని ఖరారు
హైదరాబాద్ :రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ' చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'కందిరీగ-2' చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు కూడా. అయితే 'కందిరీగ-2'కి ఆదిలోనే హంసపాదులా..మొదట్లోనే రకరకాల సమస్యలు వచ్చాయి. దర్శకుడు,నిర్మాతల విభేధాలతో ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతోంది.
అయితే ఈ సారి బెల్లంకొండ సురేష్..తన హీరో రామ్ కి ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆ పాత్రను ఎన్టీఆర్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. బెల్లంకొండకు సన్నిహితుడైన వివి వినాయిక్ ద్వారా ఇది సాధ్యమైందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.బెల్లంకొండ సురేష్,రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన కందిరీగ చిత్రం విడుదల అయ్యిన తర్వాత వీరిద్దరి మధ్యా గొడవలు చోటు చేసుకున్నాయి.
అయితే ఆ గొడవలుకు కారణం బెల్లంకొండ రెమ్యునేషన్ ఎగ్గొట్టటమే అని అప్పట్లో వినిపించింది. అయితే అస్సలు గొడవ వేరు అని తెలిసిన వారు చెప్తున్నారు. ఈ గొడవకు కారణం గౌతమ్ మీనన్ చిత్రం అని తెలుస్తోంది. గౌతమ్ మీనన్ చిత్రంలో రామ్ మొదట్లో హీరోగా ఓకే చేసాడు. అప్పుడు బెల్లంకొండ ఆ చిత్రాన్ని తెలుగు నిర్మాతగా తను వ్యవహరిద్దామని ప్లాన్ చేసి ప్రయత్నించాడు. అయితే రామ్ కి మాత్రం ఆ చిత్రం తన బాబాయ్ స్రవంతి రవికిషోర్ చేయాలని గౌతమ్ మీనన్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేసాడు.
దాంతో బెల్లంకొండ కు కాలి ఆయన ఇవ్వాల్సిన డబ్బుని ఆపు చేయటం, అప్పుడు రామ్ ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి మా లో కంప్లైంట్ చేయటం,వారు సీన్ లోకి వచ్చి డబ్బు ఇప్పించారు. చివరకు ఆ ప్రాజెక్టు రామ్ కు కూడా రాకుండా పోయింది. నాని వచ్చి సినిమా పూర్తి చేస్తున్నారు. దాంతో బెల్లంకొండ సురేష్,రామ్ ల మధ్య దూరం పెరిగింది. దాంతో కందిరీగ చిత్రం వంద రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్నా బెల్లంకొండ సురేష్ వంద రోజులు పంక్షన్ చేయటానికి ఆసక్తి చూపించటం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రామ్ ని తప్పించి ఎన్టీఆర్ ని సీన్ లోకి తెచ్చాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











