RRR: యంగ్ టైగర్ ఒక్కరితో కాదు.. ఇద్దరితో రొమాన్స్?

బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ RRR పేరుతో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. కొమురం భీం, అల్లూరి సీతా రామరాజు స్పూర్తిగా కల్పిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

బ్రిటిష్ పాలనా కాలం 1920 బ్యాక్ డ్రాపుతో రూపొందుతున్న ఈ పీరియడ్ ఫిల్మ్‌లో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. అన్ని సిద్ధం చేసుకుని సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత ఊహించని సమస్యలు ఎదురువుతున్నాయి.

తొలిషాక్

తొలిషాక్

ఈ చిత్రానికి తొలి షాక్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఎంపిక చేసిన బ్రిటిష్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం. దీంతో ఆమె స్థానంలో మరో నటిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ ఎంపికైన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు?

ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు?

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర రూమర్ వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ సరసన నటించేది ఒక్క హీరోయిన్ కాదని, ఇద్దరు అనే న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇందులో ఒక పాత్రలో నిత్యా మీనన్ నటించబోతోందట. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

త్వరలో క్లారిటీ

త్వరలో క్లారిటీ

యంగ్ టైగర్ సరసన నటించేది ఒకరా? ఇద్దరా? అనే విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. అంత కంటే ముందు డైసీ ఎడ్గర్ జోన్స్ స్థానంలో రీప్లేస్ అయ్యే హీరోయిన్ ఎవరు? అనేది ఖరారు కావాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి అండ్ టీమ్ ఆ ప్రయత్నంలోనే బిజీగా ఉన్నారు.

ఇద్దరు హీరోలు గాయాలతో...

ఇద్దరు హీరోలు గాయాలతో...

‘RRR' చిత్రంలో నటిస్తున్న ఇద్దరు హీరోలు గాయాలపాలు కావడంతో ప్రస్తుతం షూటింగ్ నిలిపి వేశారు. రామ్ చరణ్ కాలికి గాయం కావడంతో మూడు వారాలు షూటింగ్ వాయిదా వేశారు. ఇటీవల ఎన్టీఆర్ మణికట్టకు గాయమైనట్లు కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.

RRR

RRR

RRRలో ఇంకా అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య దాదాపు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రానికి ‘రాముడు రుద్రుడు రణరంగం' అనే టైటిల్ పెట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X