కాన్సిల్ అవటంలోనూ రికార్డే..ఎన్టీఆర్ కే దక్కింది
హైదరాబాద్: ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం రకరకాల కారణాలతో ఆగి, మొదలవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ని ఫాలో అవుతూ వస్తున్న వారు ఓ విషయాన్ని గమనించినట్లు చెప్తున్నారు. అది ఇప్పటికి తొమ్మి సార్లు ఈ చిత్రం షెడ్యూల్ కాన్సిల్ అయ్యి... మొదలవటం. ఏ సినిమా కూడా ఈ రకంగా ఆగి మొదలటం జరగలేదని, ఇదీ ఓ రకం రికార్డే అంటున్నారు.
ప్రతీసారి షెడ్యూల్ వేసుకోవటం, ఆర్టిస్టుల ఫ్రెష్ డేట్స్ తీసుకోవటం జరుగుతోంది. తర్వాత ఆ షెడ్యూల్ కాన్సిల్ అయ్యిందని చెప్తున్నారు. అలా ఇప్పటికి తొమ్మిది సార్లు జరిగిందని కొందరు ఆర్టిస్టులు పర్శనల్ గా అనటంతో ఇది బయిటకు వచ్చింది. కొన్ని సార్లు ఎన్టీఆర్ డేట్సో, మరొకటో సమస్య అయితే వేరోసారి కీలకమైన ఆర్టిస్టులు డేట్స్ దొరకక పోవటం కారణం అంటున్నారు. అయితే పూరీ జగన్నాథ్ స్పీడుగా తీయటంలో ఆరితేరినవాడు కాబట్టి ఈ లేటుని కవర్ చేసేసి మార్కెట్ లోకి వస్తాడంటున్నారు.

ఎన్టీఆర్ కథానాయకుడిగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ సహా చిత్ర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారు.
చట్టం పట్ల నిబద్ధత, సమాజంపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న నిజాయతీగల పోలీసు అధికారి కథ ఇది. ఎన్టీఆర్ పాత్ర, కథ, కథనం ప్రధానాంశాలుగా సినిమా రూపొందుతోంది. గత చిత్రాల్లో ఎన్టీఆర్ పోలీసు పాత్ర పోషించినా అది కొద్దిసేపు మాత్రమే. ఈ సినిమాలో పూర్తి నిడివి ఉన్న పోలీసు అధికారిగా కనిపిస్తాడు. పూరి శైలిలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, వెన్నెల కిశోర్, జయప్రకాశ్‌రెడ్డి, సప్తగిరి, కోవై పరళ, రమాప్రభ, పవిత్రా లోకేశ్ తారాగణం. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల.


Click it and Unblock the Notifications











