ఇంట్రెస్టింగ్: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే..!

వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇటీవలే అరవింద సమేత రూపంలో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే జోష్‌లో తన హిట్ పెయిర్ అయిన రాజమౌళి సెట్స్ పై వాలిపోయారు. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. అదీ ఎన్టీఆర్ తర్వాతి సినిమా విషయంపై క్లారిటీ అని తెలుస్తుండటంతో ఆ వార్త పైనే చర్చలు నడుస్తున్నాయి. మే 20 వ తేదీన పుట్టిన రోజు జరుపుకున్న ఎన్టీఆర్ ఓ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారని తెలుస్తోంది. ఎప్పుడూ అభిమానులకు చాలా దగ్గరగా ఉండే ఎన్టీఆర్ ఈ సారి తన బర్త్ డే వేడుకలు వద్దని చెప్పారు. అయినా కూడా ఆగని ఆయన అభిమానులు అర్ధరాత్రి సమయంలో ఎన్టీఆర్ ఇంటి వద్ద కోలాహలం చేశారు. ఈ నేపథ్యంలో వారితో ఆర్ఆర్ఆర్ తర్వాత తన తర్వాతి సినిమా ఏంటనేది ఎన్టీఆర్ చెప్పారట.

Ntrs intresting project after RRR

ఆర్ఆర్ఆర్ పూర్తికాగానే మళ్ళీ త్రివిక్రమ్ తోనే సినిమా చేసే ఆలోచనలో ఉన్నానని ఆయన చెప్పారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే అల్లు అర్జున్ తో సినిమా మొదలు పెట్టిన త్రివిక్రమ్ సంక్రాంతికి దీనిని పూర్తిచేయనున్నారు. మరోవైపు ఈ లోగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కూడా తుది దశకు చేరుకుంటుంది. కాబట్టి ఈ సంక్రాంతికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుందనేది ప్రస్తుతం టాక్. అయితే గత ఏడాది వెంకీ బర్త్ డే సందర్భంగా త్రివిక్రమ్.. వెంకీ కాంబోలో సినిమా ఉండనుందని ప్రకటించారు. మరోవైపు మహేష్ బాబు కూడా తనతో సినిమా చేయమనే ప్రతిపాదన పెట్టారని సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తోనే సినిమా అంటుండటం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. చూడాలి మరి చివరకు ఏది ఫైనల్ అవుతుందో!

More from Filmibeat

Read more about: rrr ram charan rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X