For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: ఎన్టీఆర్ ,సుకుమార్ చిత్రం యాక్షన్ సీన్స్ లీక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : స్టార్ హీరోల చిత్రాల్లో సీన్స్ లీక్ అవ్వటం అనేది కామన్ అయ్యిపోయింది. తాజాగా ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం యాక్షన్ సీన్స్ లీకయ్యాయని సమాచారం. ఈ మేరకు ఓ షూటింగ్ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రచారం అవుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ ఓ యాక్షన్ సీన్ లో పాల్గొనటం గమనించవచ్చు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిత్రం విషయానికి వస్తే..

    ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాకి 'నాన్నకు ప్రేమతో...' అనే పేరు ప్రచారంలో ఉంది.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

    NTR's 'Nannaku Prematho' : action scenes leaked

    నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. వచ్చే నెల 20 వరకు లండన్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    అలాగే.. ఈ చిత్రం కొన్ని కొత్త విషయాలు బయిటకు వచ్చాయి. ఈ చిత్రానికి 'నాన్నకు..ప్రేమతో' టైటిల్ నే ఫైనలైజ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు అభిరామ్. అయితే ఇదే ఖరారు అని చెప్పలేం. ఇవి ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారంలో ఉన్న విషయాలు మాత్రమే.

    దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

    NTR's 'Nannaku Prematho' : action scenes leaked

    ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి...

    ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎనౌన్సమెంట్ జరిగింది. ఆ ఎనౌన్స్ మెంట్ చేసింది మరెవరో కాదు ఎన్టీఆర్ తో గతంలో బృందావనం, రామయ్య వస్తావయ్యా చిత్రాలు నిర్మించిన దిల్ రాజు. దిల్ రాజు రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ తో చిత్రం ఎనౌన్స్ చేసారు.

    ఆ చిత్రం దర్శకుడు మరెవరో కాదు..అందరూ ఊరించినట్లుగానే కొరటాల శివ. ప్రస్తుతం మహేష్ తో శ్రీమంతుడు తో బిజిగా ఉన్న కొరటాల శివ తన తదుపరి చిత్రానికి ఎన్టీఆర్ ని ఒప్పించుకున్నారు. గంతంలోనే మిర్చి తర్వాత ఎన్టీఆర్ తో చెయ్యాల్సి ఉంది. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు కుదిరింది. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా మీడియాకు తెలియచేసారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి 2016 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

    ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ కె.చక్రవర్తి, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

    English summary
    Speculations are rife that some action scenes from NTR-Sukumar's film leaked. Few video production firms have gone a step ahead and published the leaked video clip which shows NTR chasing a goon and thrashing him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X