26 వ అంతస్దులో : ఎన్టీఆర్ కోసం లండన్ లో ఆఫీస్

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్‌కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ మాట్లాడుతూ... సాధారణంగా సెట్స్‌లోనే తీసే సన్నివేశాలకైతే ఇక్కడే అలాంటి ఏర్పాట్లు చేస్తుంటామని, సుకుమార్ పర్‌ఫెక్షన్ కోసం లండన్‌లోనే ఆఫీస్ ఎలా ఉండాలి అనే దానిప్రకారం సెట్ వేసినట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా బీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత.

సంక్రాంతి కానుకగా జనవరి 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాకి 'నాన్నకు ప్రేమతో...' అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

NTR's 'Nannaku Prematho' : Office set erected in London

దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. వచ్చే నెల 20 వరకు లండన్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే.. ఈ చిత్రం కొన్ని కొత్త విషయాలు బయిటకు వచ్చాయి. ఈ చిత్రానికి 'నాన్నకు..ప్రేమతో' టైటిల్ నే ఫైనలైజ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు అభిరామ్. అయితే ఇదే ఖరారు అని చెప్పలేం. ఇవి ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారంలో ఉన్న విషయాలు మాత్రమే.

NTR's 'Nannaku Prematho' : Office set erected in London

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి...

NTR's 'Nannaku Prematho' : Office set erected in London

ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎనౌన్సమెంట్ జరిగింది. ఆ ఎనౌన్స్ మెంట్ చేసింది మరెవరో కాదు ఎన్టీఆర్ తో గతంలో బృందావనం, రామయ్య వస్తావయ్యా చిత్రాలు నిర్మించిన దిల్ రాజు. దిల్ రాజు రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ తో చిత్రం ఎనౌన్స్ చేసారు.

ఆ చిత్రం దర్శకుడు మరెవరో కాదు..అందరూ ఊరించినట్లుగానే కొరటాల శివ. ప్రస్తుతం మహేష్ తో శ్రీమంతుడు తో బిజిగా ఉన్న కొరటాల శివ తన తదుపరి చిత్రానికి ఎన్టీఆర్ ని ఒప్పించుకున్నారు. గంతంలోనే మిర్చి తర్వాత ఎన్టీఆర్ తో చెయ్యాల్సి ఉంది. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు కుదిరింది. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా మీడియాకు తెలియచేసారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి 2016 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ కె.చక్రవర్తి, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X