రాజమౌళితో పని పూర్తికాగానే ఎన్టీఆర్..! తెరపైకి వచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్

Recommended Video

Interesting Update On Jr NTR's Next Movie After RRR || Filmibeat Telugu

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మించిన ఫాలోయింగ్ మరే హీరోకి లేదనే చెప్పుకోవచ్చు. నందమూరి వారసుడిగా ఉండే క్రేజ్‌తో పాటు నటనా పరంగా అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఆయనకు సంబందించిన అప్‌డేట్స్ పై ఆయన అభిమానుల్లో ఎప్పటికీ ఉత్కంఠ నెలకొంటూనే ఉంటుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ప్రాజెక్టు ఫినిష్ చేసిన వెంటనే కొరటాల శివ సెట్స్ పై వాలిపోనున్నాడట ఎన్టీఆర్.

శరవేగంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్

శరవేగంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్

ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న షూటింగ్ లో బిజీగా ఉన్నారు. జక్కన్న రూపొందిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు హీరోల గాయాల కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఆర్ఆర్ఆర్ ఫినిష్ అయిన వెంటనే..

ఆర్ఆర్ఆర్ ఫినిష్ అయిన వెంటనే..

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ అయిన వెంటనే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారని ఫిలింనగర్ టాక్. కొరటాలతో ఎన్టీఆర్ కి ఉన్న సాన్నిహిత్యం, గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయం సాధించిన నేపథ్యంలో వీరి కాంబోలో కొత్త సినిమా అనే టాక్ నందమూరి అభిమానుల్లో సంబరాలు నింపుతోంది.

మరోవైపు చిరంజీవి కోసం కొరటాల వెయిటింగ్

మరోవైపు చిరంజీవి కోసం కొరటాల వెయిటింగ్

ఇటీవలే భరత్ అనే నేను సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కొరటాల శివ.. మరికొద్ది రోజుల్లోనే చిరంజీవితో తన కొత్త సినిమా రూపొందించనున్నాడు. చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ ఫినిష్ కాగానే కొరటాల, చిరు కాంబోలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ పైకి వస్తుంది. అందుకే ప్రస్తుతం చిరు డేట్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు కొరటాల.

ఎన్టీఆర్, కొరటాల ఫ్రీ కాగానే

ఎన్టీఆర్, కొరటాల ఫ్రీ కాగానే

ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్, చిరంజీవి సినిమాతో కొరటాల ఫ్రీ అయిన వెంటనే ఎన్టీఆర్, కొరటాల కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని సమాచారం. వచ్చే ఏడాది మిడిల్ లో ఈ సినిమా సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X