జూ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ పూర్తిగా మార్ఫింగ్ వ్యవహారమే
జూ.ఎన్టీఆర్,సురేంద్ర రెడ్డి ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.అలాగే ఈ చిత్రం టైటిల్ కన్ఫర్మ్ అయిందంటూ, ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ కొద్ది రోజుల క్రిందట ఓ వార్త,పోస్టర్ నెట్లో విహారం చేసింది.అయితే అది కొందరు కావాలని చేసిన పని అని,దానికీ చిత్రం యూనట్ కూ సంభందం లేదని తేలింది.ఎన్టీఆర్ ఫోటో తీసుకుని ,టైటిల్ ని కలపి డిజైన్ చేసి నెట్ లో వదిలి ఫ్యాన్స్ ని ప్రక్కదారి పట్టించటానికి వదిలారుట.
అలాగే మహేష్ బాబు తాజా చిత్రం 'దూకుడు"కి కూడా జరిగింది.ఈ చిత్రంలో మహేష్‌బాబు పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడనే న్యూస్ ని బేస్ చేసుకుని, మహేష్‌బాబుకు పోలీస్ డ్రెస్ వేసేసి.. పనిలోపని 'దూకుడు" టైటిల్ కూడా డిజైన్ చేసేసి నెట్ లో పెట్టేసారు.దాంతో ఈ ఇద్దరు హీరోలు తలలు పట్టుకుంటున్నారు. మొన్నమొన్నటివరకు హీరోయిన్లకే ఈ మార్ఫింగ్ బెడద ఎక్కువగా ఉండేది.ఇప్పుడు హీరోలకు కూడా పెద్ద తలనొప్పిగా తయరైంది.అదీ సంగతి.


Click it and Unblock the Notifications











