'రభస' పై ఈ న్యూస్ నిజమేనా?
హైదరాబాద్ : జూ. ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న 'రభస' సినిమా షూటింగ్ పూర్తై ఆగష్టు 15న న రిలీజ్ చేయటానికి సిద్దం చేస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడే అవకాసం ఉందని సినీ ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఆగస్టు 28 కు ఫోస్ట్ ఫోన్ చేసే అవకాసం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఆగస్టు 28న రవితేజ పవర్ రిలీజ్ ఉంది. ఇక ఈ విషయమై అఫీషియల్ న్యూస్ ఏమీ లేదు. చిత్రం టీజర్, పాటలు ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.
ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ పూర్తి ప్రాధాన్యత ఉందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

దర్శకుడు మాట్లాడుతూ... ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మరో వినోదాత్మక యాక్షన్ తరహా చిత్రమిది. హీరో పాత్ర చిత్రణ, కథ నడవడిక వైవిధ్యంగా ఉంటాయి'' అన్నారు. అలాగే హీరోగా ప్రేక్షకుల మన్ననలను పొందిన ఎన్టీఆర్ ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ అవుతున్నారు. ఫిల్మ్‌నగర్‌లో ఇప్పుడు ఇదే టాక్. 'రభస' సినిమా ఇంట్రడక్షన్ పాట కోసం ఎన్టీఆర్ నృత్య రీతులు సమకూర్చారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











