ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’లో డైలాగు
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా 'గబ్బర్‌సింగ్' ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రంలో డైలాగు అంటూ ఒకటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే..
"బుడ్డోడు,బుడ్డోడు అని అంటే గుడ్డలూడదీసి కొడత..
అలా అనటానికి ఎవరికైనా ఒక అర్హత ఉండాలి, లేదా
నా అభిమాని అయ్యుండాలి"
ఇది ఒరిజనల్ డైలాగా లేక ఫ్యాన్స్ అభిమానంతో రాసుకున్న డైలాగా అన్నది తేలాలంటే యూనిట్ సంభందించిన వారు క్లారిఫై చేయాలి. లేదా సినిమా రిలీజ్ దాకా అన్న ఆగాలి.
ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజవుతుందని సమాచారం. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌లోని తొలిహిట్ చిత్రం 'స్టూడెంట్ నంబర్ 1' రిలీజైన తేదీ ఇది. ఈ సెంటిమెంట్ కలిసొచ్చేలా దర్శకనిర్మాతలు తాజా రిలీజ్ తేదీని ఖరారు చేశారని చెప్తున్నారు.
తొలుత ఆగస్టులో రిలీజవుతుందని వార్తలొచ్చినా..సెంటిమెంటుతో పాటు దసరా సెలవుల్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఈ మార్పులు చేశారని సమాచారం. స్టూడెంట్ నంబర్ 1 తరహాలోనే తాజా చిత్రంలోనూ ఎన్టీఆర్ స్టూడెంటుగానే నటిస్తున్నారు. శృతిహాసన్, సమంత హీరోయిన్స్ గా ఆడిపాడుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుగుతోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications












