twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రామయ్యా వస్తావయ్యా’ కి కోత మొదలైంది

    By Srikanya
    |

    హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే దాన్ని ట్రిమ్ చేసి వదులుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' మొన్న శుక్రవారం భారీగా విడుదల అయిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ కూడా డ్రాప్ అయిపోయాయి. ఫస్టాప్ కామెడీ బాగున్నా..సెకండాప్ లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగోలేదనే టాక్ వచ్చింది. దాంతో పది నిముషాల వరకూ సెకండాఫ్ ట్రిమ్ చేయనునట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పికప్ అవుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

    ఇక ఈ చిత్రం కథ చూస్తే .... మినిస్టర్ ముఖేష్ రుషి తన పెద్ద కూతురు పెళ్లి చేయటానికి సన్నాహాలు చేస్తూంటే అతనిపై రైవల్ బ్యాచ్ అజయ్ గ్రూఫ్ ఎటాక్ చేస్తుంది. దాన్ని నుంచి తప్పించుకున్న ముఖేష్ రుషి పెళ్లి కి టైట్ సెక్యూరిటీ పెడతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కాలేజీలో చదువుకుంటున్న నందు(ఎన్టీఆర్) మరో కాలేజీలో చదువుతున్న అమ్మాయి అక్షర (సమంత)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను కూడా ప్రేమలో పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఆమె మొదట కాదన్నా...తర్వాత ఓకే అంటుంది. అంతేకాకుండా తన అక్క పెళ్లికి రమ్మంటుంది. ఇంతకీ సమంత ఎవరో కాదు ముఖేష్ రుషి రెండో కూతురు. ఆ పెళ్లికి వెళ్లిన ఎన్టీఆర్ ఏం చేసాడు. ముఖేష్ రుషి కి ... ఎన్టీఆర్ కి ఏంటి సంభంధం...శృతి హాసన్ పాత్ర ఏమిటి... అనేది మిగతా కథ.

    కేవలం ఇంటర్వెల్ ట్విస్ట్ ని నమ్ముకుని చేసిన ఈ చిత్రం కథ కి సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ దెబ్బ కొట్టింది. ముఖ్యంగా దాదాపు ప్రీ క్లైమాక్స్ దాకా ప్లాష్ బ్యాక్ ఉండటంతో అది సాగిన ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు తర్వాత ఏం జరుగుతుందనే ప్రెడిక్టుబులిటీ సెకండాఫ్ లో బాగా ఎక్కువైంది. తర్వాత ఏం జరిగిందేనేది చాలా ఈజీగా ఊహించేలా తయారుచేసారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా లేకుండా పోయింది. ఉన్న కొద్ది జోకులూ పేలలేదు. ఆ మాత్రమైనా చూడగలిగామంటే అది ఎన్టీఆర్ నటనా గొప్పతనమని నిశ్శందేహంగా చెప్పవచ్చు. ఇక హరీష్ శంకర్ నుంచి ఆశించే పంచ్ లు సైతం ఫస్టాఫ్ లో బాగా పేలాయి కానీ...సెకండాఫ్ లో అవీ లేవు. అంతేకాక ఈ రోజుల్లో ఇంకా జమీలు లేని ఈ రోజుల్లో జమీందారు వారసుడు అని ఎన్టీఆర్ ని చెప్పడం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే సినిమాకు హైలెట్ అవుతుందనుకున్న శృతి హాసన్ పాత్ర కూడా తేలిపోయింది.

    English summary
    
 Ramayya Vasthavayya will be trimmed by at least 10 minutes, sources told us. With negative feedback from the audiences and thumbs down from critics, producer Dil Raju has decided to save the film by trimming the second half of the movie. Although NTR Jr fans are happy that their star did his best in the movie with his comedy in the first half, the diametrically different second half of the movie has disappointed them and they conveyed the same message to the producer Dil Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X