నందమూరి ఫ్యాన్స్ కి పండగే.. అఖండ సినిమాకు వెళ్తే ఫ్యామిలీ ప్యాకేజ్.. ఆ రెండు సినిమాల అప్డేట్స్ కూడా?
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ద్వారా తన ఇద్దరు కుమారులు అంటే జూనియర్ ఎన్టీఆర్ సహా కళ్యాణ్ రామ్ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కూడా మొదలు కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.. ఆ వివరాల్లోకి వెళితే..

సరైన హిట్ కోసం
నందమూరి బాలకృష్ణ చాలా కాలం నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత సుమారు నాలుగు సినిమాలు చేశారు గానీ ఒక్క సినిమా కూడా ఆయనకు వర్కౌట్ కాలేదు.. చివరిగా జై సింహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ సినిమాలు వర్క్ ఔట్ కావడం లేదని భావించి కాస్త గ్యాప్ తీసుకుని తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శీను దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నారు.

కరీనా కారణంగా లేట్
నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైంది. ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయినా కూడా కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ రావడమే కాక రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి కీలక నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అబ్బాయిల సినిమాల సందడి
ఈ సినిమా అబ్బాయలకి అంటే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు హెల్ప్ కానుంది. ఎలా అంటే, అఖండ సినిమా ప్రదర్శన సమయంలో ఆర్ ఆర్ మూవీ గ్లింప్స్ సహా బింబిసార టీజర్ ప్లే చేస్తారని అంటున్నారు. అఖండ సినిమా ప్లే అవుతున్న అన్ని థియేటర్లలో ఈ రెండు ఇంటర్వెల్‌లో ప్లే అవుతాయని అంటున్నారు. బాలకృష్ణ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల టీజర్ కూడా చూడడం నందమూరి అభిమానులకు ట్రీట్ అనే చెప్పాలి.

మొదటి పెద్ద సినిమా
కరోనా మహమ్మారి తర్వాత టాలీవుడ్ లో విడుదల కానున్న తొలి భారీ చిత్రం అఖండ. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. కాబట్టి, ఈ చిత్రం రెండు చిత్రాలకు ఈ సినిమా మరింత బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. అయితే రాజమౌళి సినిమాకు ఈ సినిమాకు ప్లస్ ఆమె సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ సినిమాలు బాలకృష్ణ సినిమా ఇంటర్వెల్ లో ప్రమోట్ చేస్తున్నారు అనేది మాత్రం అభిమానులకు ఒక రకమైన పండగలాంటి న్యూస్ అని చెప్పాలి.
Recommended Video

ఆ సినిమాలకు ధైర్యం ఇచ్చేలా
సింహా, లెజెండ్ వంటి రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం అఖండ. రిలీజ్ రోజున సినిమా బంపర్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది జరిగితే, సినిమా భవిష్యత్తుపై ముఖ్యంగా థియేట్రికల్ వ్యాపారంపై సందేహాలు తొలగిపోతాయి. కనుక అఖండ వర్కవుట్ అయితే 2021 సమ్మర్ వరకు రాబోయే కొన్ని నెలల పాటు వరుసలో ఉన్న పెద్ద సినిమాల నిర్మాతలు కొంచెం ధైర్యంగా ఉంటారు.


Click it and Unblock the Notifications











