ఎన్టీఆర్ లేటెస్ట్ 'శక్తి'చిత్రం బడ్జెట్ అంతా?
జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న'శక్తి' చిత్రం టోటల్ బడ్జెట్ 45 కోట్లు అని సమాచారం. ఓ ప్రక్క బడ్జెట్ తగ్గించాలి,కాస్ట్ కట్టింగ్ అని నిర్మాతల మండలి మొత్తుకుంటున్న నేపద్యంలో ఈ బడ్టెట్ తో చిత్రం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ చిత్రం ఫాంటసీ ఎలమెంట్స్ కలిసిన కథగా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. అశ్వనీదత్...తమ వైజయింతి బ్యానర్ పై తీస్తున్న ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. అలాగే సీనియర్ రచయిత సత్యానంద్ ఈ చిత్రానికి మాటలు సమకూరుస్తున్నారు. ప్రసిద్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సీనియర్ రచయిత జె.కె.భారవి, 'వరుడు', 'ఆరెంజ్' చిత్రాల ఫేమ్ తోట ప్రసాద్, 'సారాయి వీర్రాజు' దర్శకుడు డి.ఎస్.కన్నన్ స్క్రిప్టు వర్క్ లో పాలుపంచుకుంటున్నారు.
ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుకతున్న కథ ప్రకారం...ఇందులో హీరో ఓ పవర్ ఫుల్ శక్తిగా మారి హీరోయిన్ నే కాక ఓ పెద్ద వినాశనాన్నుండి ప్రపంచాన్ని రక్షిస్తాడని చెప్తున్నారు. మినిస్టర్ కూతరైన హీరోయిన్ కి బాడీగార్డుగా పనిచేసే హీరో చేసే సాహసకృత్యాలుతో ఈ చిత్రం నిండిఉంటుందని తెలుస్తోంది. ఇక ఇలియానా హీరోయిన్ రాఖీ తర్వాత ఎన్టీఆర్ సరసన చేస్తోంది. ఇక మరో ప్రక్క ఎన్టీఆర్ ఈ చిత్రంతో పాటు బృందావనం చిత్రంలోనూ చేస్తున్నారు. కాజల్, సమంతా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తూండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. శక్తి చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











