జూ ఎన్టీఆర్ 'శక్తి' ఆ హాలీవుడ్ చిత్రానికి కాపీ!?
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి చిత్రానికి 2004లో వచ్చిన 'ఛేజింగ్ లిబర్టీ' చిత్రం మూలమని చెప్తున్నారు. ఛేజింగ్ లిబర్టీ కధకి మగధీర తరహా సోషియో ఫాంటసీ కలిసి మెహర్ రమేష్ వంటకం వండాడని, దినుసులగా శక్తి ఫీఠాలని కలిపాడని తెలుస్తోంది. ఛేజింగ్ లిబర్టీ కథ ప్రకారం అమెరికా ప్రెసెడెంట్ కూతురైన హీరోయిన్ విపరీతమైన సెక్యూరిటీ కూడిన జీవితంపై ఆసక్తి చచ్చిపోయి..స్వతంత్ర జీవితాన్ని వెతుక్కుంటూ పారిపోతుంది. అదే శక్తి సినిమాలోనూ హోం మినిస్టర్ (ప్రభు) కూతురు(ఇలియానా)ఎప్పుడూ తీవ్రమైన కట్టు దిట్టంగా ఉండే భద్రతా ఏర్పాట్లును తప్పించుకుని పారిపోతుంది. ఛేజింగ్ లిబర్టీలో ఆమెకు ఓ యువకుడు (హీరో)పరిచయమవుతాడు. ఆమెపై ఎటాక్స్ జరుగుతూంటే రక్షిస్తూంటాడు. ఇద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది. ఇద్దరూ కలిసి రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయి చేస్తారు. ఒకానొక టైమ్ లో అతను తన తండ్రి పెట్టిన సెక్యూరిటీ వ్యక్తి అని తెలిసి ఆమె దూరమవుతుంది. ఇక శక్తి విషయానికి వస్తే ఇందులో ఇంట్లోంచి పారిపోయిన ఇలియానాకి జైపూర్ లో గైడ్ లా ఎన్టీఆర్ పరిచయమవుతాడు. ఇద్దరూ కలసి రకరకాల ప్రదేశాలు తిరుగుతారు. అతనితో ఆమె ప్రేమలో పడుతుంది. ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేసరికి ఎన్టీఆర్ ఆమెను సేవ్ చేయటానికి వచ్చిన సెక్యూరిటి వ్యక్తి అని రివిల్ అవుతుంది.అలాగే ఆ దాడులు జరిగేది ఆమె మీద కాదు..అతని మీదే అని అర్దమవుతుంది. అప్పుడేం జరిగిందనేది సెకెండాఫ్.


Click it and Unblock the Notifications











