భార్యకు 'దమ్ము' చూపించిన ఎన్టీఆర్?
జూ ఎన్టీఆర్ తన తాజా చిత్రం దమ్ముని తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి చూసాడని తెలుస్తోంది. ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా తన భార్య, తన కుటుంబ సభ్యులతో షో చూసారు. సినిమలోని ప్రతీ సన్నివేశాన్ని తన కుటుంబం ఎంజాయ్ చేయటంతో చాలా ఆనందపడి, గ్యారెంటీగా తన చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంగా ఉన్నారు. ఇక బోయపాటి శ్రీను డైరక్ట్ చేసిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయ్యింది. బెనిఫిట్ షో లతో ఈ చిత్రం ఉదయమే ధియోటర్స్ వద్ద సందడితో మొదలైంది. ఈ చిత్రం తన కెరీర్ లో మరో సింహాద్రిలాగ ఎన్టీఆర్ అభివర్ణిస్తున్నారు.
ఇక స్టేట్ వైడ్ గా ఎనిమిది వందల షోలు పడనున్నాయి. అలాగే బెనిఫిట్ షోలు కూడా ఓ రేంజిలో హైదరాబాద్ లో పడుతున్నాయి. ఇక దమ్ము ఎనిమిది కోట్లు షేర్ సాధిస్తుందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. టాక్ ఎలా ఉన్నా మొదటి రోజు ఈ కలెక్షన్స్ మాత్రం లోటు ఉండదని వారు చెప్తున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్, సినిమాకు వచ్చిన హైప్ పై మొదటి రోజు కలెక్షన్స్ లెక్కేస్తారు.
ఇక దమ్ము చిత్రం ఇప్పటికే అంతటా మ్యాజిక్ లా పాజిటివ్ టాక్ తో మారు మ్రోగిపోతోంది. ఇందులోని పాటలు ఇప్పటికే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాయి. సినిమా విడుదల అయ్యాక ఆడియో సేల్స్ విపరీతంగా పెరుగుతాయని తెలుస్తోంది. అలాగే సినిమాలో ఎక్కువ ఎమోషన్స్ కు, ప్యామిలీ అనుభందాలకు పెద్ద పీట వేసినట్లు చెప్తున్నారు. బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఎన్టీఆర్ తో భావోద్వేగాలు పలికించి ధియోటర్స్ లో విజిల్స్ వేయించేలా చేసాడని టాక్.
అలాగే ఈ సినిమాకు బిజినెస్ సైతం ఓ రేంజిలో జరిగి నిర్మాతను ఆనందపరిచింది. ఈ సినిమాతో త్రిష, కార్తీక కూడా తమ కెరీర్ మళ్లీ ట్రాక్ లో పడుతుందని భావిస్తున్నారు. ఎన్ఠీఆర్ సైతం తన ఊసరవెల్లి ప్లాపుని ఈ చిత్రం ఒడ్డునపడేస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం పండుగ చేసుకునేలా రూపొందించానని బోయపాటి అంటున్నారు.
నేను 'సింహా'లో ఏం చేశానో చూశారు. మొదట్నించీ నేను కొన్ని ఎమోషన్స్ పట్టుకుంటాను. వాటి మీద కథ నడుపుకుంటూ వస్తాను. అలాగే 'దమ్ము'ని కూడా కొన్ని ఎమోషన్స్ ప్రధానంగా నడిపా. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్. 'సింహా' కంటే ఏ కోశానా ఎమోషన్స్‌ని తగ్గించడానికి ప్రయత్నించలా.
ఇంకా ఓ పది శాతమన్నా ఎక్కువ ఎమోషనల్‌గా 'దమ్ము' తీశా. గట్టి నమ్మకంతో చెబుతున్నా, ప్రేక్షకుడు ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో, దాన్ని మించే ఈ సినిమా ఉంటుంది. రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుంది. చూడండి. అవునో కాదో నాకు చెప్పండి. అన్నారు.
'ఎన్టీఆర్ అంటే మాస్ హీరో. యాక్షన్ బాగా చేస్తాడు. డాన్సులు బాగా చేస్తాడు. కమర్షియల్‌గా ఉంటుంది' అనుకోవద్దు. తప్పకుండా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు. 'సింహా'లో బాలయ్యని ఎలా చూశారో, అలాగే 'దమ్ము'లో తారక్‌లోని ఓ కొత్త కోణాన్ని చూస్తారు. ఎన్టీఆర్‌కి హైవోల్టేజ్ పర్ఫార్మర్ అనీ, రౌద్ర, వీర రసాల్ని బాగా పోషిస్తారనే పేరుంది. అయితే 'సింహాద్రి' తర్వాత అంత హై వోల్టేజ్ సినిమా ఆయన నుంచి రాలేదనే అభిప్రాయం ఉంది.
దాన్ని దృష్టిలో పెట్టుకునే ఓ మంచి సినిమా తీశాను. 'సింహాద్రి' నుంచి ఎన్టీఆర్ ఏ సినిమాలైతే చేశారో, ఆ సినిమాలన్నింటినీ విశ్లేషించుకునే 'దమ్ము' తీశా. ఏ కోశానా పాత సినిమాలు ఛాయలు లేకుండా ఓ భిన్నమైన పాత్రలోనే ఆయన్ని చూపిస్తున్నా. సినిమా చూశాక 'ఎన్టీఆర్‌లో ఇలాంటి హీరో ఉన్నాడా' అని ఆశ్చర్యపోతారు అంటూ సినిమాపై విపరీతమైన ఎక్సపెక్టేషన్స్ పెంచుతున్నారు.


Click it and Unblock the Notifications











