శక్తి షూటింగ్ లో గాయపడ్డ ఎన్టీఆర్..సేఫ్
ప్రస్తుతం శక్తి షూటింగ్ లో కులుమనాలిలో ఉన్న ఎన్టీఆర్ మూడు రోజుల క్రిందట షూటింగ్ చేస్తూ కొండ గుట్ట మీదనుంచి జారి పడ్డారు. వెంటనే ఆయన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నుంచీ యూనిట్ మెంబర్స్ లోనూ, నిర్మాత అశ్వనీదత్ లోనూ ఒకటే టెన్షన్. అయితే ఆ రాత్రి లేట్ అవర్స్ లో ఆయన్ని సేఫ్ లో డిశ్చార్చ్ చేసారు. కొద్దిగా గాయాలవటంతో వాటికి డ్రస్సింగ్ చేసి నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్స్ చేసారు. క్రితం సంవత్సరం ఎలక్షన్ కాంపయిన్ లో భాగంగా యాక్సిడెంట్ కు లోనైన ఎన్టీఆర్ ని తలుచుకుని మొహర్ రమేష్, అశ్వనీదత్ కంగారుపడ్డారని సమాచారం. అయితే ఈ న్యూస్ ని బయిటకు రానివద్దని కోరటంతో మీడియాకు దూరంగా ఉంచారని తెలుస్తోంది. అలాగే దెబ్బలనుంచి కోలుకున్న ఎన్టీఆర్ తెల్లారి షూటింగ్ లో పాల్గొని అందరినీ టెన్షన్ నుంచి విముక్తులను చేయటమే కాక ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన జరిగి మూడు రోజులు అవుతోంది. ఇక ఇలియానా జంటగా చేస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ ఎడ్వంచర్ కథతో జరుగుతోందని సమాచారం. అలాగే మాజీ బాలీవుడ్ హీరోయిన్ పూజాబేడీ ఈజిప్టు వనితగా ఓ కీలకమైన పాత్రలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











