పవన్ కళ్యాణ్ లాగే ఎన్టీఆర్..క్రేజ్ వస్తుందా?

By Srikanya

హైదరాబాద్ : తెలుగు హీరోలు పాటలు పాడటం కొత్తేం కాదు. చాలా మంది నాయకులు ఒకటి రెండు సార్లు గొంతు సవరించుకొని తర్వాత ఆ వైపు ఆలోచించడం మానేస్తుంటారు. అత్తారింటికి దారేది చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ...కాటమరాయుడా పాట పాడి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. ఎన్టీఆర్‌ ఇప్పుడు నాలుగోసారి తన సినిమా కోసం పాట పాడాడు.

ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'రభస'. ఇందులో 'రాకాసి రాకాసి..' అంటూ ఓ పాటేసుకున్నాడు ఎన్టీఆర్‌. ఇప్పుడు ఆయన ఈ పాట తన సినిమా ప్రమోషన్ కి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాతలు సైతం ఈ పాటను బాగా ప్రమోట్ చెయ్యాలని భావిస్తున్నారు. ఈ పాట రికార్డింగ్‌ మంగళవారం జరిగింది. రికార్డింగ్‌ సమయంలో దిగిన ఫొటోను చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ ట్విట్టర్‌లో పెట్టాడు.

NTR Starts Singing About Rakshasi

ఎన్టీఆర్‌ గతంలో 'ఒలమ్మీ తిక్క రేగిందా..' (యమదొంగ), 'వన్‌ టూ త్రీ నేనొక కంత్రీ..' (కంత్రీ), 'వేర్‌ ఈజ్‌ దట్‌..' (అదుర్స్‌) పాటలు పాడాడు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న 'రభస'లో సమంత, ప్రణీత నాయికలు. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. త్వరలో పాటలను, వచ్చే నెల 14న సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X