ఎన్టీఆర్,సుకుమార్ చిత్రం: టైటిల్, ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు, వృత్తి

By Srikanya

హైదరాబాద్ : ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమర్ చిత్రం షూటింగ్ లో లండన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొన్ని కొత్త విషయాలు బయిటకు వచ్చాయి. ఈ చిత్రానికి 'నాన్నకు..ప్రేమతో' టైటిల్ నే ఫైనలైజ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు అభిరామ్. అయితే ఇదే ఖరారు అని చెప్పలేం. ఇవి ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారంలో ఉన్న విషయాలు మాత్రమే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

NTR,Sukumar film title & Role name

ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి...

ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎనౌన్సమెంట్ జరిగింది. ఆ ఎనౌన్స్ మెంట్ చేసింది మరెవరో కాదు ఎన్టీఆర్ తో గతంలో బృందావనం, రామయ్య వస్తావయ్యా చిత్రాలు నిర్మించిన దిల్ రాజు. దిల్ రాజు రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ తో చిత్రం ఎనౌన్స్ చేసారు.

ఆ చిత్రం దర్శకుడు మరెవరో కాదు..అందరూ ఊరించినట్లుగానే కొరటాల శివ. ప్రస్తుతం మహేష్ తో శ్రీమంతుడు తో బిజిగా ఉన్న కొరటాల శివ తన తదుపరి చిత్రానికి ఎన్టీఆర్ ని ఒప్పించుకున్నారు. గంతంలోనే మిర్చి తర్వాత ఎన్టీఆర్ తో చెయ్యాల్సి ఉంది. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు కుదిరింది. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా మీడియాకు తెలియచేసారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి 2016 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X