ఎన్టీఆర్ వైపు టర్న్ తీసుకున్న సురేంద్ర రెడ్డి
ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ మరోసారి తెరకెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టు త్వరలోనే ఎనౌన్స్ మెంట్ రానున్నదని సమాచారం. సురేంద్రరెడ్డి గత కొద్దిరోజులుగా రానా...ఊసరివిల్ల సబ్జెక్టు చెప్పి సురేష్ ప్రొడక్షన్స్ లో సిట్టింగ్ లో ఉన్నాయి. అయితే అనుకోని విధంగా సీన్ లోకి పూరి జగన్నాధ్ వచ్చి ప్రకటన వచ్చింది. ఇక రానా ప్రాజెక్టుకు ముందు స్రవంతి రవికిషోర్ తో రామ్ అండ్ జెన్నీ సబ్జెక్టు ఓకే చేయించుకుని లాంచింగ్ చేసారు. కానీ బడ్జెట్ బాగా ఎక్కువ అవుతోందనే కారణంతో అక్కడ నుంచి బయిటకు వచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ క్యాంప్ లో ఉన్నారు. ఎన్టీఆర్ కి హోమ్ బ్యానర్ లాంటి వ్యక్తి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలతో న్యూస్ రానుంది. కిక్ వంటి సూపర్ హిట్టిచ్చిన తర్వాత కూడా ఓ దర్శకుడు ప్రాజెక్టు ఇలా డిలే కావటం ఆశ్చర్యమేనంటున్నారు.
సురేంద్ర రెడ్డి జూ ఎన్టీఆర్ అశోక్ అతనొక్కడే పూరీ జగన్నాధ్ kick jr ntr surendra reddy athanokkade athidi puri jagannath


Click it and Unblock the Notifications