జూ ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి చిత్రం లేటెస్ట్ ఇన్ఫో...
గతంలో అశోక్ చిత్రంతో హిట్టు కొట్టిన సురేంద్రరెడ్డి త్వరలో ఎన్టీఆర్ తో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మహేష్ తో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కి చెయ్యాల్సిన 'మిస్టర్ పెర్ఫెక్ట్". ఈ కథను 'ఆర్య 2" చిత్రంలో మోస్ట్ పాపులర్ అయిన 'మిస్టర్ పెర్ఫెక్ట్" అనే పాటను వినగానే సురేందర్ రెడ్డి రెడీ చేసుకున్నాని చెప్తున్నాడు. కథకు తగ్గటే టైటిల్ కూడా 'మిస్టర్ పర్ఫెక్ట్" అని నిర్ణయించారు. కానీ ఇప్పుడు అంతా మారి పోయింది. మహేష్ నటించాల్సిన ఈ కథలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి నిర్మించనున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో తెలియనున్నాయి. అతి త్వరలో ఎన్టీఆర్ 'మిస్టర్ పర్ఫెక్ట్"గా మన ముందుకు రాబోతున్నాడన్నడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్...శక్తి, బృందావనం చిత్రాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. అలాగే నల్లమలుపు బుజ్జి ప్రస్తుతం రానా హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











