దైవ చింతనలో RRR హీరోలు... చరణ్ అయ్యప్ప మాల.. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు!
దేశానికి ప్రధాన మంత్రి అయినా తల్లికి కొడుకే అని అంటూ ఉంటారు. అలాగే స్టార్ హీరోలు అయినా దేవుడి భక్తులే అని నిరూపించుకుంటున్నారు మన టాలీవుడ్ హీరోలు. చాలా కాలం పాటు ఊరిస్తూ వచ్చిన RRR సినిమా ఎట్టకేలకు విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ విజువల్ వండర్ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల మార్క్ దాటేసింది. సినిమా విడుదల అయిపోవడంతో హీరోలు ఇద్దరూ ఎట్టకేలకు రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష స్వీకరించగా ఇప్పుడు ఎన్ఠీఆర్ ఆంజనేయ దీక్ష తీసుకున్నారని తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే

RRR సినిమా విడుదలై
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన సినిమా RRR. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఆయన సరసన అలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఇక ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా ఆయన సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. ఇతర కీలక పాత్రలలో అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రఖని, ఛత్రపతి శేఖర్ వంటి వారు నటించారు.

విజయం సాధించడంతో
మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ 1 మూవీగా నిలిచింది. అంతే కాదు నైజాం, అమెరికాలో అయితే వంద కోట్ల మార్కు చేరుకొని సరికొత్త చరిత్ర కూడా లిఖించింది. ఇక ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడంతో సినిమా యూనిట్ మొత్తం ఆనందంలో మునిగి పోయింది.

దైవ చింతనలో
ఇక జక్కన్న, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు తరువాతి సినిమాల్లో బిజీ అయ్యే ముందు వారు దైవ చింతనలో మునిగిపోయారు. RRR విడుదలైన వెంటనే చరణ్ అయ్యప్ప మాల ధరించారు. RRR సక్సెస్ సెలెబ్రేషన్స్ లో కూడా చరణ్ మాలలోనే హాజరయ్యారు.

ఆంజనేయ స్వామి దీక్షలో
ముంబైలో కూడా ఆయన చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతో నడవడం బాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ కూడా ఇప్పుడు దీక్ష తీసుకున్నారని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ తన ఇష్ట దైవం ఆంజనేయ స్వామి మాల ధరించారని అంటున్నారు. ఎన్టీఆర్ 21 రోజులు ఆంజనేయ స్వామి దీక్షలో ఉంటారని అంటున్నారు.
Recommended Video


తదుపరి సినిమా
ఇక ఇప్పటికే రామ్ చరణ్ మాలలో ఉండి కూడా తన తదుపరి సినిమా మొదలుపెట్టారు. ఆయన శంకర్ డైరెక్షన్ లో తన 15వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి అమృత్ సర్ లో జరుగుతోంది. ఇక మరోవైపు ఎన్టీఆర్ కొరటాల మూవీ షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమాగా కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో అలియా భట్ నటించనుందని అంటున్నారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











