‘బాద్ షా’లో ఎన్టీఆర్ ముగ్గురుగా...
హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. పరమేశ్వర ఆర్ట్‌స పతాకం పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఆ మూడు ఏమిటంటే... పల్లెటూరు యువకుడుగా... అమాయికుడుగా, పోలీస్ ఆఫీసర్ గా... తర్వాత మాఫియా డాన్ గా ఇలా ముగ్గురుగా అలరించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మూడు పాత్రలుగా కనపడినా ఒకడేనని, కథలో ఈ పాత్రలు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో సాగుతాయని తెలుస్తున్నాయి. అలాగే మూడు పాత్రలకు విభిన్నమైన మేనరిజమ్స్, హెయిర్ స్టైల్స్ తో సాగుతాయని తెలుస్తోంది.
బండ్ల శివబాబు సమర్పస్తున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రతిష్ఠాత్మక చిత్రం 'బాద్‌షా' ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగు ముగింపు దశలో వుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ నాగార్జునసాగర్ సమీపంలో షూట్ చేస్తున్నారు.ఈ సందర్భంగా హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ శ్రీనువైట్ల కథ బాగుండడంతో, ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా వుండడంతో ఈ చిత్రం చేస్తున్నానని తన కెరీర్‌లో సరికొత్త స్టైల్‌లో ఓ సెన్సేషనల్ మూవీగా బాద్‌షా నిలుస్తుందని తెలిపారు.
దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగిన విధంగా యాక్షన్ ఎమోషన్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలన్నీ ఉంటాయని, వేసవి కానుకగా ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేయనున్నామని అన్నారు. ఎన్టీఆర్ లుక్స్, స్టైల్, డైలాగ్, డాన్స్, ఫైట్స్ అన్నీ ప్రేక్షకులను అలరిస్తాయని, జనవరి నెల 16 నుండి నాన్‌స్టాప్‌గా జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుందని మార్చి 10న ఆడియో విడుదల చేయనున్నామని నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు.
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవదీప్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











