అఖిల్ కోసం స్టార్ హీరో రంగంలోకి.. నాగార్జున మాస్టర్ ప్లాన్ ఇదేనా?

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుంది. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆ హైప్‌ను మరింత పెంచేందుకు మూవీ మేకర్స్ మరో లెవెల్ లో ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కోసం టాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఇంతకీ నాగార్జున ప్లాన్ ఏంటీ?

అక్కినేని వారసుడుగా అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే.. హీరోగా తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' పర్వాలేదు అనిపించినా , అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన 'ఏజెంట్' నిరాశను మిగిల్చింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న 'లెనిన్'పై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ మార్చుకోవడంతో పాటు యాక్షన్, నటన పరంగా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

NTR to Promote Akhil Akkineni s Lenin

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంతో రూపొందిన యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌లో అఖిల్ కొత్త లుక్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు తీసుకురావాలంటే స్ట్రాంగ్ ప్రమోషన్స్ అవసరమని భావిస్తున్న మూవీ మేకర్స్ అందుకు తగ్గట్టుగానే కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారట. ముఖ్యంగా అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమా ప్రచారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోను ప్రమోషన్స్‌లో భాగం చేయాలనే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. కేవలం అతిథిగా హాజరుకావడమే కాకుండా, అఖిల్‌ను స్వయంగా ఇంటర్వ్యూ చేసే స్పెషల్ టాక్ షో తరహా కార్యక్రమాన్ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే సమాచారం . దీనిపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్త మాత్రం అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అఖిల్ కెరీర్‌లో వచ్చిన 'మిస్టర్ మజ్ను' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గతంలో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 'లెనిన్' కోసం ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తారనే ప్రచారం రావడంతో ఆ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరో. అలాంటి హీరో ఒక సినిమా ప్రమోషన్స్‌లో భాగమైతే సోషల్ మీడియాలోనే కాకుండా ప్రధాన మీడియా దృష్టి కూడా ఆ సినిమాపై పడుతుంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగి అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్‌కు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అఖిల్ లాంటి కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు అలాంటి సపోర్ట్ మార్కెట్ పరంగా కూడా పాజిటివ్ సిగ్నల్‌గా మారుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X