For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళిపై కాపీ ఆరోపణలు: RRR స్టోరీని ఆ బాలీవుడ్ మూవీ నుంచి లేపేశారట.!

  By Manoj
  |

  సినీ ఇండస్ట్రీలో కొందరు దర్శకులు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపుతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఇప్పటి తరం నుంచి దర్శకధీరుడు రాజమౌళి పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 'స్టూడెంట్ నెం 1'తో దర్శకుడిగా పరిచయమైన ఆయన... అప్పటి నుంచి ఇప్పటి వరకు సూపర్ హిట్ చిత్రాలతో టాప్ డైరెక్టర్ అయిపోయాడు. భారీ చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు సినిమాపై అన్ని ఇండస్ట్రీల దృష్టి పడేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన చేస్తున్న RRR కోసం ఓ మూవీని కాపీ కొట్టారని తాజాగా ఓ చర్చ తెరపైకి వచ్చింది. ఆ వివరాలివే.!

  తెలుగు సినిమా స్టామినాను వాళ్లకూ చూపించాడు

  తెలుగు సినిమా స్టామినాను వాళ్లకూ చూపించాడు


  అప్పటి వరకు ఓ మూస ధోరణిలో వెళ్తోన్న తెలుగు సినిమాను తన టాలెంట్‌తో మార్చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఎన్నో విభిన్నమైన చిత్రాలను తీసి సత్తా చాటడంతో పాటు టాలీవుడ్ స్టామినాను పక్క ఇండస్ట్రీలకు చూపించాడు. ఇక, ‘బాహుబలి' మూవీలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు. దీంతో మన సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

  రియల్ హీరోల కోసం... టాప్ హీరోలిద్దరిని కలిపాడు

  రియల్ హీరోల కోసం... టాప్ హీరోలిద్దరిని కలిపాడు

  ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీలు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పాటు ఇద్దరు బడా హీరోలు కలిసి చేస్తున్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చతోన్న ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

  ఒకలా అనుకుంటే... ఇంకోలా జరిగింది.. ఫైనల్‌గా

  ఒకలా అనుకుంటే... ఇంకోలా జరిగింది.. ఫైనల్‌గా

  RRR విషయంలో చిత్ర యూనిట్ అనుకున్నట్లు ఏమీ జరగడం లేదు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర పైగానే అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ మాత్రం కేవలం 75 శాతం మాత్రమే పూర్తయింది. హీరోల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం.. నటీనటులకు గాయలు.. ప్రతికూల వాతావరణం.. ఇప్పుడేమో కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతోంది.

  ఆ విషయంలో మాట తప్పిన రాజమౌళి టీమ్

  ఆ విషయంలో మాట తప్పిన రాజమౌళి టీమ్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ తేదీన సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. దీంతో విడుదల తేదీ మారిపోయింది. ఇందులో భాగంగానే ఈ చిత్రాన్ని జనవరి 8, 2021న విడుదల చేస్తామని రాజమౌళి అండ్ టీమ్ ఆ మధ్య ప్రకటించింది.

  దానికి భారీ స్పందన.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ

  దానికి భారీ స్పందన.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ

  కొద్ది రోజుల క్రితం ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. దానికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ పుట్టినరోజున అతడి ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అయింది. దీనికి భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోయాయి. అయితే, ఎన్టీఆర్ పుట్టినరోజుకు రావాల్సిన వీడియో మాత్రం లాక్‌డౌన్ వల్ల క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.

  రాజమౌళిపై కాపీ ఆరోపణలు.. తెరపైకి కొత్త చర్చ

  రాజమౌళిపై కాపీ ఆరోపణలు.. తెరపైకి కొత్త చర్చ

  ప్రస్తుతం లాక్‌డౌన్ పిరియడ్ నడుస్తోన్న కారణంగా RRR షూటింగ్‌కు సుదీర్ఘ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదల మరోసారి వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కథను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ నుంచి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో రాజమౌళిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  #HBDNBK Birthday Special: Caricature Pic Of Chiru Balayya & Total Tolywood Heroes Goes Viral
  RRR స్టోరీని ఆ బాలీవుడ్ మూవీ నుంచి లేపేశారట.!

  RRR స్టోరీని ఆ బాలీవుడ్ మూవీ నుంచి లేపేశారట.!

  2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘లగాన్'. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో బ్రిటీష్ దొరసాని హీరో ప్రేమలో పడుతుంది. అతడికి సాయం చేయడం కోసం దేశాన్ని కూడా లెక్క చేయదు. ఇప్పుడిదే లైన్‌ను RRRలో వాడబోతున్నాడట జక్కన్న. జూనియర్ ఎన్టీఆర్ - ఒలీవియా మోరిస్ లవ్ ట్రాక్ ఇదే తరహాలో ఉంటుందని తాజా సమాచారం.

  English summary
  RRR is an upcoming 2021 Indian Telugu-language period action film written and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan, Alia Bhatt and character actor Ajay Devgn.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X