హాట్ న్యూస్ : ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం ఖరారు,వివరాలు

By Srikanya

హైదరాబాద్: ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌ గురించి త్వరలోనే పూర్తి వివరాలతో ప్రకటన రానుందని సమాచారం. విజయ దశమి రోజున ఈ చిత్రం ఓపినింగ్ జరగనుందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం స్టోరీ లైన్ ఓకే అయ్యి...కధా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నవీన్ అనే ఓ ఎన్నారై ఈ చిత్రం నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలియవచ్చింది.

గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నవరత్న టాల్క్ యాడ్‌లో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య సినిమా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ ఓకే అయింది. తర్వలో ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తు ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరో వైపు ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం అయింది. అంతేగాక ఎన్టీఆర్, కందీరీగ దర్శకుడు కాంబినేషన్ చిత్రం కూడా పిభ్రవరి 14న ప్రారంభం అవుతోంది.

ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే... ఇటీవలే జులాయి మూవీతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు త్వరలో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సరదా అనే వర్కింగ్ టైటిల్ తో వ్యవహిస్తున్నారు. జల్సా తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ పై ట్రేడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం పూర్తయ్యాక ఎన్టీఆర్ తో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X