అరవింద సమేతలో ఐటెం సాంగ్... ఆ టాప్ హీరోయిన్ చేస్తోంది!
Recommended Video

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. అజ్ఞాతవాసి చిత్రం పరాజయం చెందడంతో ఎన్టీఆర్ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. సినిమా మొదటి నుండి జాగ్రత్తగా తెరకేక్కిస్తున్నాడు. ముఖ్యంగా సినిమాలో డైలాగ్స్ తూటాల్లా పేలబోతున్నాయని సమాచారం. తాజాగా ఈ సినిమాలోని ఒక డైలాగ్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా (అరవింద సమేత) ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసరప్రాంతం అయిన కొంపల్లి లో జరుగుతోంది.

విజయాన్ని అందుకోవాలని త్రివిక్రమ్
అజ్ఞాతవాసి చిత్రం పరాజయం చెందడంతో ఎన్టీఆర్ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. సినిమా మొదటి నుండి జాగ్రత్తగా తెరకేక్కిస్తున్నాడు. ముఖ్యంగా సినిమాలో డైలాగ్స్ తూటాల్లా పేలబోతున్నాయని సమాచారం. తాజాగా ఈ సినిమాలోని ఒక డైలాగ్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

గతంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఒకటి ఉందట. కాజల్ అగర్వాల్ ఈ సాంగ్ చెయ్యబోతున్నట్లు సమాచారం. గతంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. రెండో సారి ఎన్టీఆర్ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ చేయ్యబోతోందని సమాచారం.

దసరాకి సినిమా విడుదల
తాజాగా జరుగుతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత సినిమాలోని ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఫ్యామిలీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది దసరాకి సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.


Click it and Unblock the Notifications











