ఎన్టీఆర్ అరవింద సమేత డైలాగ్ లీక్.. అన్నా మాది రాయలసీమ...
Recommended Video

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టు అరవింద సమేత. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. సంగీత దర్శకుడు తమన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. పూజా హెగ్డే చిత్ర సెట్స్ లో పాల్గొనడం జరిగింది.

మూవీ పై అంచనాలు
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టు అరవింద సమేత. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచే మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

తమన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్
సంగీత దర్శకుడు తమన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. పూజా హెగ్డే చిత్ర సెట్స్ లో పాల్గొనడం జరిగింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను పెట్టుకొని కొత్త లుక్ ట్రై చెయ్యడం జరిగింది.

అన్నా మాది రాయలసీమ..
ఈ సినిమా పొలిటికల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలోని ఒక డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ''అన్నా మాది రాయలసీమ.. నమ్మితే ప్రాణాలు ఇస్తాం.. నమ్మకద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాం''. ఈ డైలాగ్ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ చెప్పబోతున్నట్లు సమాచారం.

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్
తాజాగా అరవింద సమేత సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్ వేశారట. కొన్ని కీలక సన్నివేశాలు ఈ సెట్స్ లో షూట్ చేసినట్లు సమాచారం. హారికా హాసిని బ్యానర్ లో చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











