ఎన్టీఆర్, త్రివిక్రమ్ టైటిల్ ఇదేనట.. అదే నిజమైతే ఫ్యూజుల్ అవుట్
Recommended Video

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్, అజ్ఞాతవాసి లాంటి భారీ ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇదే. ఈ చిత్రంపై అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు త్రివిక్రమ్ అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకొన్నారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనున్న ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

మార్చిలో సెట్స్‌పైకి
సుమారు రెండు నెలల క్రితం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా ముహూర్తపు షాట్‌కు శ్రీకారం చుట్టారు. అజ్ఞాతవాసి సినిమా పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్రీ ప్రోడక్షన్‌లో మునిగిపోయారు. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది.

చాలా పేర్లు తెరపైకి
ఎన్టీఆర్ సినిమాకు అనేక టైటిల్స్ మీడియాలో ప్రచారం అయ్యాయి. రాముడు, భీముడు ఇతర పేర్లు బాగానే వినిపించాయి. అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చిన సినిమా పేరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది.

త్రివిక్రమ్ టైటిల్ ఇదేనట
త్రివిక్రమ్ రూపొందించే ఈ సినిమా పేరు ఆన్ సైలెంట్ మోడ్ అని వినిపించింది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్నప్పటికీ కథకు ఉన్న విశిష్టతను బట్టి పెట్టాల్సి వచ్చిందనే మాట సినీ వర్గాల్లో ఉంది. అయితే మెయిన్ టైటిల్ వేరే ఉంటుందని, ఇది కేవలం ఉపశీర్షిక పెట్టే అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ తెరపైకి
తొలుత ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రచారం జరిగింది. అయితే అజ్ఞాతవాసి తర్వాత అనిరుధ్ వెనుకకు వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌తో పూజా హెగ్డే
ఇక డీజేలో బికినీతో దర్శనమిచ్చి గ్లామర్ హీరోయిన్‌గా నూటికి నూరు మార్కులు సంపాదించుకొన్న పూజా హెగ్డే.. ఎన్టీఆర్‌తో జతకట్టనున్నది. ఇటీవలే పూజా పేరును అధికారికంగా ప్రకటించారు. స్వయంగా పూజా హెగ్డే తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం గమనార్హం.

ఎన్టీఆర్ కొత్త లుక్
త్రివిక్రమ్ మార్కుగా కనిపించే ఈ చిత్రంలో ఎన్టీఆర్ గెటప్ ఇతర చిత్రాలకు భిన్నంగా ఉండబోతుందట. ఈ సినిమా కోసం తన బాడీని పూర్తిగా మార్చేసుకోబోతున్నాడట. ఇందుకోసం ప్రత్యేక యంగ్ టైగర్ జిమ్ టైనర్‌ను పెట్టుకొన్నట్టు సమాచారం.

దసరా బరిలో ఎన్టీఆర్
ఎన్నో విశేషాలతో సెట్స్‌పైకి వెళ్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై కే రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్నిమార్చిలో ప్రారంభించి అక్టోబర్ కల్లా పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేసే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











