ఎన్టీఆర్ రాజకీయం..... కారణం దర్శకుడు త్రివిక్రమే?
పొలిటికల్ డ్రామా కాన్సెప్టుతో త్రివిక్రమ్ ఓ కథ రాసుకున్నాడని, ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై సెటైర్ లా ఈ సినిమా ఉండబోతోందని, ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అభిమానులకు తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వానికి తోడు ఎన్టీఆర్‌కు ఉన్న ఫాలోయిగ్, వాగ్ధాటి, ఎలాంటి విమర్శలకైనా చదురంగా సమాధానం ఇవ్వగల నేర్పు.... ఎన్టీఆర్ సొంతం.
అయితే ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఎవరు అడ్డు పడుతున్నారో? తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈ రియల్ లైప్ రాజకీయాల సంగతి పక్కన పెడితే రీల్ లైఫ్ లో ఎన్టీఆర్ రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.

పొలిటికల్ డ్రామా
పొలిటికల్ డ్రామా కాన్సెప్టుతో త్రివిక్రమ్ ఓ కథ రాసుకున్నాడని, ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై సెటైర్ లా ఈ సినిమా ఉండబోతోందని, ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

ఎన్టీఆరే కరెక్ట్
పవర్ ఫుల్ గా డైలాగ్ డెలివరీ ఇవ్వడంలో టాలీవుడ్ ది బెస్ట్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. తాను రాసుకున్న పొలిటికల్ కాన్సెప్టుకు, డైలాగ్ లకు ఎన్టీఆర్ అయితేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట త్రివిక్రమ్. ఈ కథ, కాంబినేషన్ ఓకే అయతే వెండితెరపై ఓ రేంజిలో పవర్ ఫుల్ డైలాగులు పేలనున్నాయి.

వచ్చే ఏడాది
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జై లవ కుశ' సినిమాతో, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మూవీతో బిజీగా ఉన్నారు. అన్నీ ఓకే అయితే వచ్చే ఏడాది సినిమా ఓకే కాబోతోంది.

ఎన్టీఆర్
ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











