తారక్, త్రివిక్రమ్ మధ్య ‘హీరోయిన్’ చిచ్చు.. పవన్ క్లాప్ కొట్టిన సినిమా సెట్స్‌పైకి వెళ్లడం కష్టమేనా?
Recommended Video

జై లవకుశతో జోష్ మీద ఉన్న ఎన్టీఆర్, వరుస విజయాలతో దూసుకెళ్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా అనగానే ఇది రేర్ కాంబినేషన్ అనే మాట సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ముహూర్తంగా షాట్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జరగడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత ఈ చిత్రం ముందుకెళ్లే అవకాశం లేదనే నిరాధారమైన వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మరో కథపై దృష్టిపెడుతున్నారని వచ్చిన వార్త అందుకు బలం చేకూర్చే విధంగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ మధ్య
త్రివిక్రమ్, ఎన్టీఆర్ మధ్య విభేదాలు చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం నటీనటుల ఎంపిక అనే మాట వినిపిస్తున్నది. ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం సీనియర్ నటి టబును ఎంపిక చేయడం ఎన్టీఆర్‌కు నచ్చలేదనేది ఆ గాసిప్ సారాంశం.

మరో కథపై ఎన్టీఆర్ దృష్టి
సీనియర్ నటి ఎంపిక వివాదం కొనసాగుతుండగానే మరో వార్త మీడియాలో వెలుగు చూసింది. త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి తారక్ మరో కథ కోసం ఎదురుచూస్తున్నాడన్న విషయాన్ని కథనంలో పేర్కొన్నారు.

వచ్చే ఏడాదికి వాయిదా
అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో సినిమా పనుల్లో బిజీగా ఉన్నందున ఎన్టీఆర్ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తున్నది. ఈ లోపు మరో సినిమా చేసే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నట్టు సమాచారం.

దిల్ రాజుకు కమిట్‌మెంట్
త్రివిక్రమ్ సినిమా ప్రారంభానికి ముందే ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో ఓ సినిమా కమిట్ అయ్యారనే వార్త ప్రచారంలో ఉంది. జై లవకుశ, స్పైడర్ చిత్రాలు దిల్ రాజుకు నష్టాలను తెచ్చిన నేపథ్యంలో ఆయనను వాటి నుంచి బయట పడేయడానికి ఈ సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి.

ఎన్టీఆర్ శ్రీనివాస కల్యాణం
ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాపై అనుమానాలు తలెత్తడంతో దిల్ రాజుతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. గత సంక్రాంతికి శతమానం భవతి అనే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన సతీష్ వెగ్నేశతో సినిమా చేయడానికి యంగ్ టైగర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి శ్రీనివాస కళ్యాణం అని టైటిల్ కూడా ఖరారు అయినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











