»   » టెంపర్‌లో అలా చేశాడు..ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆలస్యం ఎందుకో తెలిస్తే ఫాన్స్ కు పూనకాలే!

టెంపర్‌లో అలా చేశాడు..ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆలస్యం ఎందుకో తెలిస్తే ఫాన్స్ కు పూనకాలే!

Subscribe to Filmibeat Telugu
NTR Makeover For Trivikram Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. టెంపర్ చిత్రం మొదలుకు ఎన్టీఆర్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఎన్టీఆర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుత విజయాలుగా మారుతున్నాయి. దీనితో ఎన్టీఆర్ తదుపరి సినిమాల పట్ల ఫాన్స్ లో ఆసక్తి పెరిగిపోతోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడో ప్రారంభం కావలసింది. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే విషయంలో ఆలస్యం జరుగుతోంది. సినిమా ఆలస్యం అవుతున్నప్పటికీ ఇది ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకునే న్యూస్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ని త్రివిక్రమ్ ఫైనల్ చేశాకే సినిమా ప్రారంభం కానుందట.

లుక్స్ మారుస్తున్న ఎన్టీఆర్

లుక్స్ మారుస్తున్న ఎన్టీఆర్

ప్రతి చిత్రంలోనూ తన అభిమానులకు కొత్త అనుభూతిని కలిగించడానికి ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే సినిమా సినిమాకు తన లుక్స్ ని మార్చుకుంటున్నాడు.

 టెంపర్‌లో అలా

టెంపర్‌లో అలా

టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అభిమానులని తెగ ఆకట్టుకుంది. ఆ చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ గెటప్, బోడి లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చేశాడు. బ్యాడ్ కాప్ గా ఎన్టీఆర్ నటన టెంపర్ చిత్రంలో అదుర్స్.

ఫలించిన సుకుమార్ ప్రయోగం

ఫలించిన సుకుమార్ ప్రయోగం

ఆ తరువాత ఎన్టీఆర్ నటించిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ చిత్రంలో కూడా సుకుమార్ ఎన్టీఆర్ ని కొత్తగా ప్రజెంట్ చేసాడు. ఎన్టీఆర్ పొడవాటి గడ్డం లుక్ అభిమానులని విపరీతమా ఆకట్టుకుంది.

సింపుల్‌గా స్టైలిష్ గా

సింపుల్‌గా స్టైలిష్ గా

కొరటాల శివ తెరకెక్కించిన జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ సింపుల్ గా కనిపిస్తూనే స్టైలిష్ ఆటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.

జై పాత్రలో నట విశ్వరూపం

జై పాత్రలో నట విశ్వరూపం

ఎన్టిఆర్ చివరగా నటించిన చిత్రం జై లవకుశ ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో అదుర్స్ అనిపించాడు. జై పాత్రలో అయితే ఎన్టీఆర్ నటనతో అదరగొట్టాడు. జైపాత్రలో ఎన్టీఆర్ గెటప్ కూడా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

మునుపెన్నడూ చూడని ఎన్టీఆర్

మునుపెన్నడూ చూడని ఎన్టీఆర్

గత చిత్రాల్లో లేని విధంగా, మునుపెన్నడూ చూడని విధంగా తాను తెరకెక్కించబోయే చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ఉండాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కసరత్తులు

ఎన్టీఆర్ కసరత్తులు

ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ స్టీవెన్స్ సమక్షంలో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తివిక్రమ్ కోరుకున్న లుక్ వచ్చేలా తరచుగా ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నాడట. ఈ చిత్రంలో వెండి తెరపై ఎన్టీఆర్ ని అద్భుతంగా చూపించాలని చూపించాలని త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడు.

అందుకే ఆలస్యం

అందుకే ఆలస్యం

ఎన్టీఆర్ లుక్ ఫైనల్ అయ్యాకే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అందువలనే చిత్రం సెట్స్ పైకి వెళ్లే తేదీ ఆలస్యం అవుతోందని అంటున్నారు. ఎన్టీఆర్ అదిరిపోయే లుక్ లో కనిపించాలే కానీ ఫాన్స్ కు అంతకుమించి కావలసింది ఏముంది!

English summary
NTR trying to change his makeover for Trivikram movie. Trivikram wants best look of NTR till date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu