'దమ్ము'లో ఇరవై నిముషాలు హీరో కనిపించడా?
రేపు రిలీజు కాబోతున్న దమ్ము చిత్రంపై రకరకాల వార్తలు వినపడుతున్నాయి. సెకండాఫ్ లో హీరో ఇరవై నిముషాలు సేపు కనిపించడని చెప్తున్నారు. అయితే అది ప్లాష్ బ్యాక్ ఎపిసోడని, అదే కథకు కీలకమని,కాబట్టి హీరో లేకపోయినా దాని స్టామినా తగ్గదని అంటున్నారు. ఈ విషయం నిజమా లేక రూమరా అన్నది తెల్లారి షో పడి చూస్తే కానీ తెలియదు. ఇక ఈ చిత్రం సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి శ్రీను రూపొందించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్తగా కనిపించబోతున్నారు.
ఫస్టాఫ్ లో కామిడీ ఓకే అని,ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అద్బుతంగా చేసారని తెలుస్తోంది. ఇక ఫస్టాఫ్ లో వచ్చే ఓ సాంగ్ అదిరిపోయిందని, ఓవరాల్ గా ఫస్టాఫ్ రిపోర్టు మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. సెకండాఫ్ లో సిస్టర్ సెంటిమెంట్, క్యారెక్టరైజేషన్ సూపర్ గా ఉన్నాయని, క్లైమాక్స్ లో కాస్త హింస పాళ్లు ఎక్కువైనా పీక్స్ లెవెల్లో తీసాడని అంటున్నారు. ముఖ్యంగా పంచ్ డైలాగులుకు జనం విజిల్స్ పడటం ఖాయం అంటున్నారు. బోయపాటి శ్రీను సింహా ని మించేలా ఈ చిత్రంలో ప్రతీ సీనూ ప్లాన్ చేసాడని టాక్. ఎన్టీఆర్ సైతం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత కాన్పిడెంట్ గా ఉన్నారు.
ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం పండుగ చేసుకునేలా రూపొందించానని బోయపాటి అంటున్నారు. నేను 'సింహా'లో ఏం చేశానో చూశారు. మొదట్నించీ నేను కొన్ని ఎమోషన్స్ పట్టుకుంటాను. వాటి మీద కథ నడుపుకుంటూ వస్తాను. అలాగే 'దమ్ము'ని కూడా కొన్ని ఎమోషన్స్ ప్రధానంగా నడిపా. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్. 'సింహా' కంటే ఏ కోశానా ఎమోషన్స్‌ని తగ్గించడానికి ప్రయత్నించలా. ఇంకా ఓ పది శాతమన్నా ఎక్కువ ఎమోషనల్‌గా 'దమ్ము' తీశా. గట్టి నమ్మకంతో చెబుతున్నా, ప్రేక్షకుడు ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో, దాన్ని మించే ఈ సినిమా ఉంటుంది. రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుంది. చూడండి. అవునో కాదో నాకు చెప్పండి. అన్నారు.
'సింహా'లో బాలయ్యని ఎలా చూశారో, అలాగే 'దమ్ము'లో తారక్‌లోని ఓ కొత్త కోణాన్ని చూస్తారు. 'ఎన్టీఆర్ అంటే మాస్ హీరో. యాక్షన్ బాగా చేస్తాడు. డాన్సులు బాగా చేస్తాడు. కమర్షియల్‌గా ఉంటుంది' అనుకోవద్దు. తప్పకుండా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు. ఎన్టీఆర్‌కి హైవోల్టేజ్ పర్ఫార్మర్ అనీ, రౌద్ర, వీర రసాల్ని బాగా పోషిస్తారనే పేరుంది. అయితే 'సింహాద్రి' తర్వాత అంత హై వోల్టేజ్ సినిమా ఆయన నుంచి రాలేదనే అభిప్రాయం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఓ మంచి సినిమా తీశాను. 'సింహాద్రి' నుంచి ఎన్టీఆర్ ఏ సినిమాలైతే చేశారో, ఆ సినిమాలన్నింటినీ విశ్లేషించుకునే 'దమ్ము' తీశా. ఏ కోశానా పాత సినిమాలు ఛాయలు లేకుండా ఓ భిన్నమైన పాత్రలోనే ఆయన్ని చూపిస్తున్నా. సినిమా చూశాక 'ఎన్టీఆర్‌లో ఇలాంటి హీరో ఉన్నాడా' అని ఆశ్చర్యపోతారు అంటూ సినిమాపై విపరీతమైన ఎక్సపెక్టేషన్స్ పెంచుతున్నారు.


Click it and Unblock the Notifications











