వెంకటేష్ కి జూ. ఎన్టీఆర్ ట్విస్టు
హైదరాబాద్: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయం ఉత్సాహంలో ఉన్న వెంకటేష్ తన తదుపరి చిత్రం షాడోకి సిద్దమవుతున్నారు. షాడో చిత్రాన్ని ఏప్రియల్ 5న విడదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదే రోజున ఎన్టీఆర్ తాజా చిత్రం బాద్షా కూడా విడుదల కానుంది. దాంతో అసలే అరజయాల్లో ఉన్న వెంకటేష్ కి ఇది ఊహించని ట్విస్టే అంటున్నారు. సీతమ్మ వాకిట్లో హిట్ టాక్ తెచ్చుకున్నా ఆ క్రెడిట్ మొత్తం మహేష్ కి వెళ్తోందనేది నిజం. దాంతో ఆయన సోలో హీరోగా వచ్చే సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
అయితే వెంకటేష్ మాత్రం తన తాజా చిత్రం షాడో పై చాలా ఆశలు పెట్టుకున్నారు. వెంకీ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... ''చేసే ప్రతి పాత్ర వైవిధ్యంగా ఉండాలని నా అభిప్రాయం. 'సీతమ్మ వాకిట్లో...' చిత్రంలో భావోద్వేగాలతో నిండిన పాత్ర చేశాను. దానికి భిన్నంగా 'షాడో' ఉండబోతోంది. ఇందులో ప్రతీకారం తీర్చుకొనే పాత్ర నాది. చాలా స్త్టెలిష్‌గా ఉంటుంది. వేసవికి ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.'' అన్నారు.
ఇక బాద్షా విషయానికి వస్తే..ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రం ఆడియో ఈ మార్చి 10 న విడుదల కానుంది. అలాగే చిత్రం ఏప్రియల్ 5న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 16 నుంచి ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ జరగనుంది. ఈ మేరకు నిర్మాత బండ్ల గణేష్ ఖరారు చేసారు.
జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











