twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రభస' ఆ సినిమాలాంటిదేట

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ కు అదుర్స్ తర్వాత అలాంటి హిట్ మళ్లీ పడలేదు. వస్తున్న సినిమాలన్నీ సోసోగా ఉంటున్నాయి. యాక్షన్, కామెడీ ట్రెండ్ ని మిక్స్ చేస్తూ బాద్షా చేసినా అదీ అంత కిక్ ఇవ్వలేదు. దమ్ము సరేసరి...దుమ్ము రేపుతుందంటే..భాక్సాఫీస్ నోట్లో దుమ్ము కొట్టి పోయింది. రామయ్యా వస్తావయ్యా కూడా జనాలను భయపెట్టింది. దాంతో క్యారెక్టర్ కామెడీని పెంచి, యాక్షన్ తగ్గించి ఎన్టీఆర్ ఈ సారి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యి రభస చేస్తున్నాడంటున్నారు. ఈ చిత్రం తనకు ఖచ్చితంగా హిట్ ఇస్తుందని భావిస్తున్నాడు. అందులోనూ దర్శకుడు కూడా కందిరీగ తరహాలోనే కామెడీనీ బాగా దట్టించాడని చెప్తున్నారు.

    ఈ చిత్రంలో రెండు షేడ్స్ తో క్యారెక్టర్ నడుస్తుందని, ఒక క్యారెక్టర్ ఫుల్ కామెడీ అంటున్నారు. ఎన్టీఆర్, కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోండటంతో మంచి క్రేజ్ వస్తోంది. ఈ మధ్యన కొంతకాలం షూటింగ్ గ్యాప్ వచ్చిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మళ్లీ కంటిన్యూగా జరగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'రభస' అనే పేరు పరిశీలనలో ఉంది. బెల్లకొండ సురేష్‌ నిర్మాత. సమంత, ప్రణీత హీరోయిన్స్.

    బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ.... ' ఆ కుర్రాడికి దూకుడెక్కువ. మాటల్తో మడతెట్టేస్తాడు. చేతలతో పడగొట్టేస్తుంటాడు. తేడా వస్తే.. రభస చేయడానికి రెడీ అంటాడు. మరి ఆ జోరు ఎలా ఉంటుందో చూడాలంటే.. మా సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. 'ఆది' తరవాత ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులకు నచ్చేలా ఉంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా తీర్చిదిద్దుతున్నాం. మా సంస్థలో ఇది మరపురాని చిత్రం అవుతుంది'' అని చెబుతున్నారు.

    NTR wants to repeats Adurs feat!

    దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

    ఇక... ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు. ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    NTR is calmly focusing on Rabhasa film which will release during late summer. NTR character has two shades in this film and one of them is going to be hilarious to the maximum.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X