'అలా మొదలైంది' నిర్మాతకి జూ.ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చాడా?
నాని, నిత్యా మీనన్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టయిన చిత్రం అలా మొదలైంది. ఈ చిత్రం యాభై రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత దామోదర్ రెడ్డి మాట్లాడుతూ....నిజానికి తమ చిత్రం ఆశించిన రీతిలో విజయవంతం కాలేదని, దానికి కారణం అనుకున్న ధియోటర్స్ దొరక్కపోవటమేనని అన్నాడు. అలాగే రెండు వారాలు పాటు మల్టి ప్లెక్స్ లో షోలు సరిపడినవన్నీ పడలేదని అదికూడా దెబ్బ కొట్టిందని చెప్పాడు. అంతేగాక తాను చిత్రాన్ని సుదర్శన్ 35 ఎం ఎంలో విడుదల చేద్దామనుకున్నానని, అయితే అందులో ఓ స్టార్ హీరో చిత్రం నడుస్తూండటంతో తనకు ఆ ధియోటర్ ఇవ్వలేదని, అప్పటికే ఆ చిత్రం నలభై రోజుల పాటు డెఫిషిట్ లో నడుస్తున్నా దాన్ని తీయటానికి ఎగ్జిబిటర్ ఒప్పుకోలేదని వాపోయాడు.
ఇంతకీ ఆ ధియోటర్ లో అప్పటికి ఆడుతున్న చిత్రం ఎన్టీఆర్ నటించిన బృందావనం. దిల్ రాజు నిర్మించిన ఆ చిత్రం కలెక్షన్స్ ఆశించిన స్ధాయిలో లేకపోయినా మొదట ఎగ్జిబిటర్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం చిత్రాన్ని నడిపారు. ఈ విషయమే దామోదర్ రెడ్డి ఎత్తారు. దాంతో ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ ...ఆ నిర్మాతకు ఫోన్ చేయించాడని, ఇలా మాట్లాడినందుకు సీరియస్ అయ్యాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.అంతేగాక ఎన్టీఆర్ సర్కిల్ లోని కొందరు వార్నింగ్ తరహాలో మాట్లాడారని, ఆ నిర్మాత తన వారి దగ్గర వాపోయారని చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఎన్టీఆర్ చేయలేదని ఆయనకు చెందిన వారు తొందరపడి చేసారని మరో మాట వినపడుతోంది. అదీ సంగతి..


Click it and Unblock the Notifications











