మరోసారి రావణుడిగా ఎన్టీఆర్.. భారీ ప్రాజెక్టులో భాగం కానున్నాడా?

Recommended Video

Jr Ntr To Play As Ravana In Mythological Epic Ramayana || Filmibeat Telugu

భారత దేశ సినీ పరిశ్రమలో మరో భారీ సినిమా తెరకెక్కబోతోంది. రామాయణ పేరుతో అత్యంత భారీ బడ్జెట్, ఉన్నత విలువలతో సినిమాను తెరకెక్కించేందుకు పూనుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఈ సినిమా నిర్మాణంలో ముగ్గురు నిర్మాతలు భాగం కానుండగా.. అందులో ఒకరిగా టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఉండటం ఆసక్తికర అంశం. కాగా రామాయణ సినిమాకు సంబంధించి ఈ ఆసక్తికి రెట్టింపు ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. వివరాల్లోకి పోతే..

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రామాయణ

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రామాయణ

ఇటీవలే ప్రకటించబడిన రామాయణ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇద్దరు డైరెక్టర్లు స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతున్నారు. మొత్తం మూడు పార్టులుగా రూపొందించ బోతున్న రామాయణ సిరీస్ మొదటి భాగాన్ని 2021 లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇద్దరు డైరెక్టర్లు.. ముగ్గురు నిర్మాతలు

ఇద్దరు డైరెక్టర్లు.. ముగ్గురు నిర్మాతలు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇద్దరు డైరెక్టర్లు రామాయణ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 'దంగల్' ఫేం నితేశ్ తివారీ, శ్రీదేవి ప్రధాన పాత్రలో వచ్చిన 'మామ్' డైరెక్టర్ రవి ఉద్యవార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రపంచ ఆడియన్స్ టార్గెట్‌గా భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సహా నమిత్ మల్హోత్రా, మధు మంతెన ఈ సినిమా నిర్మాణంలో భాగం కానున్నారు.

రాముడు.. రావణుడు

రాముడు.. రావణుడు

రామాయణ అంటే ముందుగా గుర్తొచ్చేది రాముడు, రావణుడే. దీంతో ఈ రెండు పాత్రలు ఎవరు చేస్తారా? అనే అప్‌డేట్ కోసమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పటికే రాముడిగా రామ్ చరణ్‌ని సంప్రదించగా, ఆయన ఓకే చెప్పలేదని తెలిసింది. ఈ లోగా ఇప్పుడు రావణుడి పాత్ర కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరును పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది.

రౌద్రపూర్తిమైన పాత్ర.. ఎన్టీఆర్ అడుగు పెడితే

రౌద్రపూర్తిమైన పాత్ర.. ఎన్టీఆర్ అడుగు పెడితే

రౌద్రపూర్తిమైన రావణుడి పాత్రను ఎన్టీఆర్‌తో చేయించాలని యూనిట్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ రావణుడిగా అదరగొట్టాడు.. అలాగే ఇటీవల వచ్చిన జై లవకుశ సినిమాలో రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్ చించేశారు. ఈ నేపథ్యంలో రావణుడి పాత్ర ఎన్టీఆర్‌కి మాత్రమే సూట్ అవుతుందని భావిస్తున్నారట మేకర్స్.

ఎన్టీఆర్ రెడీ అయ్యేనా..?

ఎన్టీఆర్ రెడీ అయ్యేనా..?

నిజానికి ఇలాంటి భారీ ప్రాజెక్టులో ఎన్టీఆర్ భాగమైతే ఇక జరిగే సంచలనాలు ఊహించగలమా? చెప్పండి. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నారు. ఓ వైపు RRR షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు కన్ఫర్మ్ చేసుకున్నారు ఎన్టీఆర్. చూడాలి మరి ఒకవేళ యూనిట్ సంప్రదిస్తే 'రామాయణ' విషయంలో ఎన్టీఆర్ డిసీజన్ ఎలా ఉంటుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X