twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: 'రణ్ భూమి'లో ఎన్టీఆర్.. ఆ సీక్రెట్స్ అన్నీ దర్శకుడే చెప్పాలి!

    |

    Recommended Video

    Jr.NTR Gets Comments From Varun Dhawan

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో ఆఇంతే ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నటన, డాన్స్ లో తిరుగులేని ప్రతిభ ఎన్టీఆర్ సొంతం. టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్.. బాలీవుడ్ లోకి ప్రవేశించేది ఎప్పుడు అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ బాలీవడ్ ఎంట్రీపై ఆసక్తిని మరింతగా పెంచేసాయి.

    కనీవినీ ఎరుగని విధంగా

    కనీవినీ ఎరుగని విధంగా

    బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మణంలో రణ్ భూమి చిత్రానికి బీజం పడింది. ప్రముఖ రచయిత, దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. వరుణ్ ధావన్ ఈ చిత్రంలో పోరాట వీరుడిగా కనిపించబోతున్నాడు. యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.

    విడుదల తేదీ

    విడుదల తేదీ

    ఈ భారీ చిత్రాన్ని 2020 దీపావళికి విడుదలచేయబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించే నటీనటుల్ని ఎంపిక చేయవలసి ఉంది. బాలీవుడ్ లో యుద్ధ నేపథ్యం ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల పద్మావత్ చిత్రం విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    ఎన్టీఆర్ ప్రస్తావన

    ఎన్టీఆర్ ప్రస్తావన

    ఇటీవల సోషల్ మీడియాలో వరుణ్ ధావన్ ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకుని వచ్చాడు. ఎన్టీఆర్ గురించి అడగగా ఆయనకు నేను అభిమానిని అంటూ వరుణ్ సమాధానం ఇవ్వడం విశేషం.

    రణ్ భూమిలో ఎన్టీఆర్

    రణ్ భూమిలో ఎన్టీఆర్

    మీరు వారియర్ గా నటించే రణ్ భూమి చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారా అని మరో అభిమాని ప్రశ్నించాడు. అలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. దర్శకుడు శశాంక్ మాత్రమే అలాంటి సీక్రెట్స్ బయట పెట్టాలి అంటూ వరుణ్ ప్రస్తావించడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది.

    అలాంటి చిత్రాలకు

    అలాంటి చిత్రాలకు

    పురాణ గాధలు, ఫాంటసీ, యుద్ధం నేపథ్యం ఉన్న చిత్రాలకు ఎన్టీఆర్ అతికినట్లు సరిపోతాడనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఆ తరహా చిత్రం ఎన్టీఆర్ ఎప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

    English summary
    NTR will make Bollywood entry soon. Varun Dhawan interesting comments on NTR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X