NTR NEEL : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో తారక్ రొమాన్స్

ఆర్ఆర్ఆర్, దేవర పార్ట్ 1 చిత్రాలతో జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. కానీ దేవర సినిమా మాత్రం తారక్ అభిమానులకు ఆశించినంత రేంజ్ లో లేకపోవడంతో గమనార్హం. దీంతో తన అప్ కమింగ్ చిత్రాలతో ఎలాగైనా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషనల్ వసూళ్లను అందుకోవాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న సినిమాలపై ఫుల్ ఫోకప్ పెట్టారు. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న 'డ్రాగన్' చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి యాక్షన్ చిత్రాలను డైరెక్ట్ చేసి సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ జూ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతుండటంతో అత్యంత భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా తేపకో అప్డేట్ అందుతూనే ఉంది. ఇక తాజాగా మాత్రం కిక్కిచ్చే న్యూస్ వ్యాప్తి చెందుతోంది.

NTR will Romance with Three Heroines in Prashanth Neel Upcoming Movie

కాగా, ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో తారాగణంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అందలేదు. అసలు ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ల సంగతే తెలియలేదు. కాగా తాజాగా డ్రాగన్ సినిమాలో నటించబోయే హీరోయిన్ల కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కెమెస్ట్రీ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

ఇక స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఎన్టీఆర్ తో జతకట్టబోతుందని వినిపిస్తుంది. ముఖ్యంగా శృతి హాసన్ ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగ్ చేయబోతుందని ఇండస్ట్రీలో టాక్. మరోవైపు 'ప్రేమలు' చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న యంగ్ బ్యూటీ మమితా బైజూ కూడా ఎన్టీఆర్ సరసన ఓ కీలక పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. మరీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ఇలా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరిపిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ఇప్పటికే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నాలుగు రోజుల పాటు సాగింది. 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. రీసెంట్ గానే 2వ షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు. ఈ షెడ్యూల్ ను ఏప్రిల్ 22 నుంచి కర్ణాటకలో కొనసాగిస్తున్నారు. మరోవైపు జూ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ మూవీ 'వార్2' ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, వై రవి శంకర్, నవీన్ ఏర్నేని నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం.

More from Filmibeat

Read more about: jr ntr prashanth neel dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X