పోటి పడబోతున్న ఎన్టీఆర్, వైఎస్ఆర్ సినిమాలు
హీరో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఆనందో బ్రహ్మ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహిత్ రాఘవ రాజశేఖర్ రెడ్డి జీవిత్రచరిత్రగా 'యాత్ర' సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది.
Recommended Video


కీరవాణి సంగీతం అందిస్తున్నాడు
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన వర్క్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని బాలకృష్ణ స్వయంగా ప్రకటించడం జరిగింది. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు.

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించబడుతున్న సినిమా యాత్ర. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చెయ్యడం జరిగింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

నృత్య కళాకారిణి అయిన ఆశ్రిత
నృత్య కళాకారిణి అయిన ఆశ్రిత .. 'బాహుబలి 2' లో 'కన్నా నిదురించరా ..' అనే పాటలో అనుష్కతో పాటు నటించింది. ఈమె పలు షోస్ లో క్లాసిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఈమె వైయస్ఆర్ బయోపిక్ లో విజయమ్మ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇద్దరు మహా నేతల సినిమాలు
రెండు బయోపిక్ లు వచ్చే సంక్రాంతికి పోటిపడబోతున్నాయి. ఇద్దరు మహా నేతల సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. రెండు సినిమలు అనౌన్స్ చెయ్యడం వరుకు మాతమే జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











